11, ఆగస్టు 2010, బుధవారం

భారత రాజ్యాంగం లోని షెడ్యూళ్ళు

భారత రాజ్యంగ రూపకల్పన సమయంలో 8 షెడ్యూళ్ళు ఉండగా ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు కలవు. 1951 లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9 వ షెడ్యూల్ ను చేర్చగా, 1985 లో 52 వ రాజ్యాంగ సవరన ద్వారా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాలంలో 10 వ షెడ్యూల్ ను రాజ్యాంగంలో చేర్చినారు. ఆ తర్వాత 1992 లో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా 11 మరియు 12 వ షెడ్యూళ్ళను చేర్చబడినది.

1 వ షెడ్యూల్ .......భారత సమాఖ్యలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు
2 వ షెడ్యూల్ ......జీత భత్యాలు
3 వ షెడ్యూల్ ......ప్రమాణ స్వీకారాలు
4 వ షెడ్యూల్ ......రాజ్యసభలో రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సీట్ల విభజన
5 వ షెడ్యూల్ ......షేడ్యూల్ ప్రాంతాల పరిపాలన
6 వ షెడ్యూల్ ......ఈశాన్య రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల పరిపాలన
7 వ షెడ్యూల్ ......కేంద్ర, రాష్ట్రాల మద్య అధికార విభజన
8 వ షెడ్యూల్ ......రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు
9 వ షెడ్యూల్ ......కోర్టుల పరిధిలోకి రాని కేంద్ర, రాష్ట్రాలు జారీ చేసిన చట్టాలు
10 వ షెడ్యూల్ ......పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం
11 వ షెడ్యూల్ ......గ్రామ పంచాయతిల అధికారాలు
12 వ షెడ్యూల్ ......నగర పంచాయతి, మునిసిపాలిటిల అధికారాలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి