19, ఆగస్టు 2010, గురువారం

ఎన్నికలు

ఒక వ్యక్తిని నాయకునిగా ఎన్నుకోవటానికి ఎన్నికలు (Elections) నిర్వహిస్తారు. సాధారణంగా ప్రజా ప్రతినిధిని ఎన్నికల ద్వారా ఎన్నుకుంటాం. దీనిని ఏ రంగంలోనైన నాయకుడిని ఎన్నుకోనుటకు ఉపయోగించవచ్చు. ఎన్నికలలో నాయకులు కావాలనుకుంటున్న వ్యక్తులు పోటీ చేస్తారు. కానీ కొన్నిసార్లు ఒకరే అభ్యర్ధి నిలబడినప్పుడు లేదా ఇతర అభ్యర్ధులు తొలగినప్పుడు ఏకగ్రీవ ఎన్నిక జరుగుతుంది.



భారత ఎన్నికల కమిషను


స్వతంత్ర భారత దేశంలో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగం ఏర్పాటు చేసిన సంస్థ భారత ఎన్నికల కమిషను (Election Commission of India). 1950 జనవరి 25 న ఏర్పాటు చేయబడిన ఈ కమిషను సుప్రీం కోర్టు వలెనే, రాజ్యాంగం ఏర్పరచిన స్వతంత్ర వ్యవస్థ, ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఉండదు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ జాతీయ ఎన్నికల కమీషన్ లో భాగం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషన్ [1] ఓటరు జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ పనులను చేస్తుంది.


ఎన్నికలు వివిధ రకాలు


1.రాష్ట్రపతి ఎన్నికలు

2.సాధారణ ఎన్నికలు

3.స్థానిక స్వపరిపాలన సంస్థ ఎన్నికలు


ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు (ఈవీఎం )



1999 ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాల ముద్రణకు 7,700 టన్నుల కాగితం వాడారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ కోసం ఈవీఎం వాడుతుండటం వల్ల 10,000 టన్నుల కాగితం మిగులుతోంది. కేరళ రాష్ట్రంలోని పరూర్ శాసనసభ నియోజకవర్గంలో 1982లో జరిగిన ఉప ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా ఈవీఎం ఉపయోగించారు. వీటిని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే రెండు ప్రభుత్వ రంగ సంస్థలు తయారుచేస్తాయి. విద్యుత్తు సరఫరా లేని చోట్ల కూడా వీటిని ఉపయోగించవచ్చు. ఇవి ఆల్కలైన్ బ్యాటరీ సహాయంతో పనిచేస్తాయి. ఒక్కో ఈవీఎం 3,840 ఓట్లను నిక్షిప్తం చేసుకోగలదు. ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 1400లోపు మంది ఓటర్లనే ఎన్నికల కమిషన్ అనుమతిస్తుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు 64 మంది కంటే తక్కువగా ఉంటేనే ఈవీఎంలు వాడతారు. అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులుంటే బ్యాలెట్ పేపరు ఉపయోగిస్తారు.2004 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని చోట్లా ఈవీఎంలనే ఉపయోగించారు.



ఆషామాషీ అభ్యర్దులు


ఎన్నికలను ఆషామాషీగా తీసుకుని పోటీ చేసే అభ్యర్థులకు అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టారు.ఇకపై ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులు రూ.25 వేల డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ డిపాజిట్‌ రూ.10వేలే ఉంది. డిపాజిట్‌ పెంచుతూ ప్రతిపాదించిన ప్రజాప్రాతినిధ్య(సవరణ)బిల్లు 2009 ఇప్పటికే రాజ్యసభ ఆమోదం పొందింది.ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు చెల్లిస్తున్న రూ.5 వేలను రూ.12,500కు పెంచగా.. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల డిపాజిట్‌ను రెట్టింపు చేశారు. ధన, కండ బలాన్ని, కుల, ప్రాంతీయ ధోరణులను కట్టడి చేస్తూ.. ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా నిర్వహించాల్సిన అవసరం ఉందని బిల్లును ప్రవేశపెడుతూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి మొయిలీ పేర్కొన్నారు.


ఎన్నికల ప్రవర్తనా నియమావళి
రాజకీయనేతల ప్రవర్తన..




1.పార్టీలు, నేతలు అభ్యర్థులు జాతి, కుల, మత, ప్రాంతీయపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించకూడదు. ఇతర రాజకీయ పార్టీలను విమర్శించేటప్పుడు వాటి గత చరిత్రను, ఇంతకు ముందు పనితీరును మాత్రమే దృష్టిలో ఉంచుకోవాలి. ప్రజా జీవితంతో సంబంధంలేని, వ్యక్తిగత దూషణలు చేయకూడదు. 2.రాజకీయ ప్రకటనల ద్వారా కుల, మతపరమైన అభ్యర్థనలు చేయకూడదు. మసీదులు, చర్చిలు, దేవాలయాలు, ఇతర ప్రార్థన, పవిత్ర స్థలాల్లో ఎన్నికల ప్రచారం చేయకూడదు. 3.ఓటర్లకు లంచాలు ఇచ్చి ప్రలోభపెట్టడం, బెదిరించడం, ఒకరి స్థానంలో మరొకరిని ఓటరుగా వినియోగించుకోవడం, 4.పోలింగ్‌స్టేషన్‌కు 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించడం వంటివి చేయరాదు. 5.గడువు దాటాక కూడా ప్రచారం చేయడం, పోలింగ్ స్టేషన్‌కు ఓటర్లను తీసుకురావడం, తిరిగి తీసుకువెళ్లడం... వంటివి నిషిద్ధం. ప్రశాంత గృహ జీవితాన్ని గడిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. దానికి భంగం కలిగేలా ప్రవర్తించకూడదు. ప్రజల ఇళ్ల ముందు నిరసన ప్రదర్శనలు చేయడం, పికెటింగ్‌లు చేయడం వంటివి నిబంధనలకు విరుద్ధం. 6.అనుమతి లేకుండా ఇళ్లపై జెండాలు ఎగరవేయడం, బ్యానర్లు కట్టడం, గోడలపై నినాదాలు రాయడం, పోస్టర్లు అతికించడం నిషిద్ధం.




సభలు, సమావేశాలు


1.పార్టీలు సభలు నిర్వహించాలనుకున్నప్పుడు ముందుగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. సభ నిర్వహణ ప్రదేశం, సమయం గురించి తప్పకుండా చెప్పాలి. దాన్ని బట్టి పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారు. 2.సభలు, సమావేశాలు ఏర్పాటు చేయాలనుకునే చోట ఏమైనా నిషేధాజ్ఞలు ఉన్నాయా అని అభ్యర్థులు ముందుగానే తెలుసుకోవాలి. నిషేధా జ్ఞలు అమలయ్యే ప్రదేశాల్లోకి ప్రవేశించినప్పుడు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. 3.లౌడ్‌స్పీకర్లు ఏర్పాటు చేయాలనుకుంటే ముందుగానే అనుమతి తీసుకోవాలి. 4.సభలకు ఎవరైనా భంగం కలిగించేలా ప్రవర్తిస్తే... నిర్వాహకులు వారిపై నేరుగా దాడులకు పాల్పడకూడదు. పోలీసులకు సమాచారం అందించాలి.



ఊరేగింపులు


1.పార్టీలు.. ఊరేగింపులకు అధికారుల నుంచి ముందుగా అనుమతి పొందాలి. ఎప్పుడు మొదలవుతుంది? ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఏ మార్గం గుండా వెళుతుంది? తదితర వివరాలన్నీ ముందే సమర్పించాలి. ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులకూ అందించాలి. దాన్నిబట్టి వారు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారు. 2.ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఊరేగింపు పొడవుగా ఉంటే, దాన్ని మధ్యలో విడగొట్టి కూడళ్ల వద్ద ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూడాలి. 3.సమావేశాలు, ఊరేగింపులకు ఇతర పార్టీల నాయకులు, వారి అనుచరులు వాటికి భంగం కలిగించకూడదు. నిలదీయకూడదు. కరపత్రాలు పంచరాదు. 4.ఒకపార్టీ వేసిన పోస్టర్లను వేరే పార్టీ వారు తొలగించకూడదు. 5.రెండు అంత కంటే ఎక్కువ పార్టీలు ఒకేదారిలో ఒకే సమయంలో ఊరేగింపు నిర్వహించాలనుకుంటే... ముందుగానే పోలీసులను సంప్రదించాలి. ఊరేగింపులు ఎదురెదురుగా రాకుండా, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారు. 6.ఊరేంగింపులో మూడు కంటే ఎక్కువ వాహనాలు వాడితే ఎన్నికల వ్యయంలో చూపించాలి.



పోలింగ్ రోజున1.


ఓటర్లు ప్రశాంతంగా, ప్రజాస్వామికంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలు కల్పించాలి. అన్ని పార్టీల నేతలు ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులకు సహకరించాలి. 2.పోలింగ్ బూత్‌లలో కూర్చునే పార్టీల ప్రతినిధులకు అధికార గుర్తింపు కార్డులు విధిగా అందజేయాలి. వీటిపై పార్టీల గుర్తులు, పేర్లు ఉండకూడదు. 3.ఎన్నికలకు 48 గంటలకు ముందుగా ప్రచారం చేయకూడదు. ప్రచార రూపంలో ఎస్ఎంఎస్‌లు కూడా నిషేధం. 4.పోలింగ్‌రోజు, అంతకు 24 గంటల ముందు మద్యం పంపిణీ చేయకూడదు. 5.అభ్యర్థులు, వారి అనుచరులు పోలింగ్‌బూత్‌ల సమీపంలో ఏర్పాటుచేసే శిబిరాల్లో పెద్ద సంఖ్యలో గుమిగూడి ఉండకూడదు. 6.శిబిరాల్లో పోస్టర్లు, జెండాలు, గుర్తులు, ఇంకా ఇతర ఎన్నికల సామాగ్రి ఏమీ ఉండకూడదు. తినుబండారాలను కూడా పంపిణీ చేయకూడదు.



అధికార పార్టీ..


1.అధికార పార్టీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు. పార్టీ పనులకు పాలన యంత్రాగాన్ని వినియోగించుకోకూడదు. 2.అధికార పర్యటనలు, పార్టీ ప్రచార పర్యటనలు రెండూ కలిపి ఉండకూడదు. 3.ముఖ్యమంత్రితో సహా ఎవరైనా సరే హెలికాప్టర్‌తోపాటు ఇతర ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు. ఇంటి నుంచి కార్యాలయానికి, కార్యాలయం నుంచి ఇంటికి తప్ప మరే ఇతర పనులకు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు. 4.సెక్యూరిటీ వాహనాల్లోనూ మూడు కంటే ఎక్కువ వాడితే దాన్ని ఎన్నికల వ్యయం కింద సంబంధిత పార్టీ చూపించాలి. 5.ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఎన్నికల వ్యయం అమల్లోకి వస్తుంది. 6.ప్రభుత్వ వసతి గృహాలు, సభాస్థలిలు, హెలిప్యాడ్‌లు... తదితర సౌకర్యాలను కేవలం అధికారపార్టీ వారి వినియోగానికే కాకుండా ఇతర పార్టీలకూ అవకాశం కల్పించాలి. 7.పత్రికల్లో, టీవీల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ప్రకటనలు ఇవ్వకూడదు. 8.టీవీల్లో ప్రకటనలు ఇచ్చే ముందు దానికి సంబంధించిన సీడీని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీకి చూపించి, అనుమతి పొందాలి. 9.ఎన్నికల నియమావళి వెలువడ్డాక ఎలాంటి గ్రాంట్లు, చెల్లింపులు చేయకూడదు.కొత్త పథకాలు ప్రకటించకూడదు. శంకుస్థాపనలు చేయకూడదు.రహదారుల నిర్మాణం, తాగునీటి వసతులపై హామీలు ఇవ్వకూడదు.

16, ఆగస్టు 2010, సోమవారం

"భారత స్వాతంత్రోద్యమము"

భారత ఉపఖండం లో స్వాతంత్ర్య సముపార్జనకై జరిగిన అనేక ఉద్యమాలనన్నిటినీ కలిపి "భారత స్వాతంత్రోద్యమము" (Indian Freedom Struggle) గా పరిగణిస్తారు. అనేక సాయుధ పోరాటాలు, అహింసాయుత పద్దతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్రోద్యమములో బాగాలు. భారత ఉపఖండంలోని బ్రిటిష్ మరియూ ఇతర వలసపాలకుల పాలనను అంతమొందంచటానికి వివిధ సిద్దాంతాను అనుసరించే అనేక రాజకీయపక్షాలు ఉద్యమించాయి. 16వ శతాబ్దములో బుడతగీచు (పోర్చుగీసు) వారి ఆక్రమణలకు వ్యతిరేకంగా అబ్బక్కరాణి చేసిన పోరాటాలను, 17వ శతాబ్దం మద్యలో బెంగాల్ లో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటాలను వలస పాలనపై వ్యతిరేకతకు మొదటి అడుగులుగా చెప్పవచ్చు. మొదటి సంఘటిత సాయుధ పోరాటం బెంగాల్ లో ప్రారంభమై తరువాత రాజకీయ పోరాటంగా పరిణామంచెంది భారత జాతీయ కాంగ్రెస్ గా ఆవిర్భవించింది.


20వ శతాబ్దం మెదట్లో ఈ పద్దతులలో మౌలికమైన (రాడికల్) మార్పులు వచ్చాయి. కాంగ్రెసులో అతివాదులైన లాలా లజపతిరాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్ర పాల్, (లాల్ బాల్ పాల్) విదేశీవస్తు బహిష్కరణ, సమ్మె, స్వావలంబన మొదలైన పద్ధతులను అవలంబిస్తే, అరబిందో వంటివారు తీవ్రవాద మార్గాలను అవలంబిచారు. మెదటి దశకాలలో సాయుధ విప్లవ పోరాటాలు ప్రారంభమయ్యాయి. మొదటి ప్రపంచయుద్ధ సమయంలో జర్మనీ, అమెరికాల లోని భారత స్వాతంత్రయోదులు ప్రారంభించిన గదర్ పార్టీ సహకారంతో జరిగిన సంఘటిత బారతసిపాయిల తిరుగుబాటు జాతీయోద్యమంలో వచ్చిన మౌలిక మార్పుగా చెప్పవచ్చు.


జాతీయోద్యమం చివరి దశలో జాతీయ కాంగ్రెస్ మహాత్మాగాంధీ నాయకత్వంలో అహింసాయుత మార్గాలలో ఉద్యమించింది. ప్రముఖ విద్యావేత్త రాంజీ సింగ్ మహాత్మాగాంధీని 20వ శతాబ్దంలో అవతరించిన బోధిసత్వునిగా కీర్తించాడు. [1] అయితే ఇతర నాయకులు సాయుధ పోరాటాలను అవలంబించారు. సుభాష్ చంద్ర బోస్, సాయుధ సంగ్రామమే సరైనదిగా భావిస్తే, స్వామి సహజానంద సరస్వతి సన్నకారు రైతులు, శ్రామికుల సంపూర్ణ ఆర్దిక స్వాతంత్రానికై పిలుపునిచ్చాడు. రెండవ ప్రపంచయుద్ధ కాలానికి ఈ ఉద్యమాలు ఉధృతరూపం దాల్చాయి. నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో భారత జాతీయసైన్యాన్ని స్థాపించి తూర్పు ఆసియా నుండి పోరాడగా భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది.


ఇలాంటి అనేక పోరాటాల ఫలితంగా అవిభక్త భారతదేశంలోని దేశాలు స్వతంత్ర దేశాలయినాయి.1947 ఆగష్టు 15న భారత దేశం స్వతంత్ర్యదేశంగా ఆవిర్బవించినప్పటకీ 1950 జనవరి 26 న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అయితే అప్పటివరకూ బ్రిటీష్ వారి పాక్షిక పాలలోనే సాగింది. భారత రాజ్యాగం భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆవిర్బవించిది. ఉపఖండంలో మరో దేశం పాకిస్తాన్ 1956 లో ఇస్లామిక్ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించినప్పటికీ ఆ దేశంలో అనేక అంతర్గత అధికార పోరాటాల కారణంగా ప్రజాస్వామ్యం అణిచెవేయబడింది, ఈ పరిణామాలు చివరకి 1971 భారత పాకిస్తాన్ యుద్ధంలో తూర్పుపాకిస్తాన్ బంగ్లాదేశ్ గా ఆవిర్బనించేందుకు దారితీశాయి


భారత జాతీయోద్యమం అనేక దేశాలలో వలసపాలనలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలకు ఉత్ప్రేరకంగా పనిచేసి, బ్రిటీష్ సామ్రాజ్య పతనానికీ కామన్ వెల్త్ ఆవిర్బావానికీ దారితీసింది. తరువాత జరిగిన అనేక ఉద్యమాలకు అహింసాయుత గాంధేయవాదం మార్గదర్శకం అయింది. 1955-1968 మార్టిన్ లూథర్ కింగ్ ఆధ్వర్యంలో జరిగిన అమెరికా పౌరహక్కుల ఉద్యమం, దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా నెల్సన్ మండేలా చేసిన పోరాటం, మయన్మార్ లో ఆంగ్ సాన్ సూకీ ప్రజాస్వామ్యం కోసం చేసే పోరాటాలాను అందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఆయితే ఈ నాయకులందరూ గాంధేయవాదాలయిన అహింస, సత్యాలని తుచ తప్పక పాటించారని చెప్పలేము.


ప్లాసీ యుద్ధం తరువాత మీర్ జాఫర్‌తో రాబర్ట్ క్లైవ్లాభదాయకమైన సుగంధద్రవ్యాల వ్యాపారార్థం 1498 లో వాస్కోడగామా కాలికట్ లోని కోజికోడ్ ఓడరేవులో కాలిడినప్పటినుంచీ ఐరోపా వర్తకుల రాకపోకలు భారత ఉపఖండంలో ప్రారంభమయ్యాయి. 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని బ్రిటీష్ సైన్యం బెంగాల్ నవాబుపై విజయం సాధించటంతో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ప్రారంభమైంది. ఈ యుద్ధం తరువాత బెంగాల్, బీహార్‌లు ఈస్ట్ ఇండియా కంపెనీ హస్తగతమయ్యాయి. 1765 లో బక్సర్ యుద్ధంలో ఒరిస్సా కూడా కంపెనీ వశమైంది. 1839 లో మహారాజా రంజిత్ సింగ్ మరణానంతరం 1845-46 లో జరిగిన మొదటి ఆంగ్ల సిక్కు యుద్ధం తరువాత 1848-1849 లో జరిగిన రెండవ ఆంగ్ల సిక్కు యుద్ధాల పర్యవసానంగా పంజాబ్, కంపెనీ వశమైంది. ఈ కాలంలో బ్రిటీష్ పార్లమెంటు కొత్తగా ఆక్రమించుకోబడిన రాజ్యాల పరిపాలనార్థమై అనేక శాసనాలు చేసింది. 1773 రెగ్యులేటింగ్ చట్టం, 1784 లో చేసిన ఇండియా చట్టం, 1813 చార్టర్ చట్టం మెదలయినవి బారతదేశంలో బ్రిటీష్ అధికారాన్ని సుస్థిరం చేసాయి. 1835 లొ ఇంగ్లీషును ఆధికారిక భాషగా గుర్తించారు. ఈ సమయంలో ప్రాచ్యవిద్యని అభ్యసించిన హిందూ విద్యావేత్తలు హిందూ ధర్మంలోని సాంఘిక దురాచారాలైన సతీ సహగమనం, కులవివక్ష, బాల్య వివాహాలను రూపుమాపటానికి ఉద్యమించారు. ఈ విదంగా బొంబాయి, మద్రాసులలో ఏర్పడిన సంఘాలు రాజకీయసంఘాలుగా పరిణతి చెందాయి. ఉన్నత విద్యనభ్యసించిన నాటి తొలి సంస్కర్తలు పత్రికలను మిక్కిలి సమర్దవంతంగా ఉపయోగించుకోవడం కారణంగా ఆనాటి సామాజిక విలువలు, మతసంప్రదాయాలకు ఎక్కువ విఘాతం కలగకుండానే సంస్కరణలు సాధ్యమయ్యాయి.


బ్రిటీష్ పాలన వలన పరోక్షంగా ఆధునిక భావజాలం వ్యాప్తిచెందినప్పటికీ, భారతీయులు బ్రిటీష్ వారి వలసపాలన పట్ల వ్యతిరేకతను పెంచుకో సాగారు. నైన్త్ లాన్సర్స్ లో నిక్షిప్తమైన హెన్రీ ఔరీ జ్ఞాపకాలు, సుగంధద్రవ్య వ్యాపారి ఫ్రాంక్ బ్రౌన్ తన మేనల్లునికి వ్రాసిన ఉత్తరాలు బ్రిటీష్ పాలనలో భారతీయులపఒ జరిగిన దాష్టీకాలను తెలియజేస్తాయి. ఉపఖండంలో బ్రిటీష్ వారి అధికారం పెరిగేకొద్దీ వారు భారతీయుల ఆచారాలను హేళన చెయ్యడం ఎక్కువయింది. మసీదులలో పార్టీలు చేసుకోవడం, తాజ్ మహల్ పై సైనిక నృత్యాలను ప్రదర్శించటం, రద్దీగా వుండే దారులలో, సంతలలో తమకు అడ్డువచ్చిన వారిని కొరడాలతో కొట్టడం (ఆధారం హెన్రీ బ్లేక్ జ్ఞాపకాలు), సిపాయిలను అగౌరవంగా చూడటంవంటి ఆగడాలు పెచ్చుమీరాయి. 1849 పంజాబ్ ఆక్రమణ తరువాత అనేక చిన్నచిన్న తిరుగుబాట్లు జరిగాయి, అయితే వీటిని బలవంతంగా అణచివేసారు.



విషయ సూచిక :--


1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటం (సిపాయిల తిరుగుబాటు)
తిరుగుబాటు తదనంతర పరిణామాలు
సంఘటిత ఉద్యమాలు
భారత జాతీయవాద పుట్టుక
బెంగాల్ విభజన
మొదటి ప్రపంచ యుద్ధం
భారత్ కు గాంధీ ఆగమనం
రౌలట్ చట్టం దాని తదనంతర పరిణామాలు
సహాయ నిరాకరణోద్యమాలు
మెదటి సహాయ నిరాకరణోద్యమము
సంపూర్ణ స్వతంత్ర్యము (పూర్ణ స్వరాజ్)
ఉప్పు సత్యాగ్రహం
ఎన్నికలు మరియు లాహోర్ తీర్మానము
విప్లవ పోరాటాలు
అంతిమ ఘట్టం: యుద్ధం, క్విట్ ఇండియా, ఐ.ఎన్.ఎ మరియు యుద్ధానంతర తిరుగుబాట్లు
భారత జాతీయ సైన్యం
క్విట్ ఇండియా
రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు(RIN Mutiny)

ఉద్యమాల ప్రాధాన్యత
స్వాతంత్ర్యము, 1947 - 1950 మధ్య పరిణామాలు




1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటం (సిపాయిల తిరుగుబాటు):--


1857–58 మధ్యకాలంలో ఉత్తర, మధ్య భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లని 1857 సిపాయిల తిరుగుబాటుగా పరిగణిస్తారు. భారత చరిత్రకారులు ఈ తిరుగుబాట్లని 'ప్రథమ స్వతంత్ర సంగ్రామంగా బావిస్తారు. దశాబ్దాలుగా భారతీయ సిపాయిలకీ బ్రిటీష్ అధికారులకీ మధ్యగల జాతీయ, సాంస్కృతిక వైరుధ్యాలు తిరుగుబాట్లకి దారితీసాయి. బ్రిటిష్ వారికి భారత పాలకులైన మొగలాయి, పేష్వాల పట్లగల నిర్లక్ష్య వైఖరి మరియూ ఔధ్ విలీనం లాంటి రాజకీయ కారణాలు భారతీయులలో బ్రిటిష్ పాలన పట్ల వ్యతిరేకత కలిగించాయి. డల్హౌసీ రాజ్యసంక్రమణ సిద్దాంతం, మొగలాయిలని వారి వారసత్వ స్థలం నుంచి కుత్బ్ కు తరలిపొమ్మనటం ప్రజాగ్రహానికి కారణమయ్యాయి. ఆయితే తిరుగుబాటుకి ముఖ్య కారణం పి/53 లీ ఏన్ఫిల్ద్ రైఫిల్, 557 కాలిబర్ రైఫిళ్ళలో ఆవు, పంది కొవ్వు పూసిన తూటాలను వాడటం. సిపాయిలు ఈ తూటాలను నోటితో ఒలిచి, రైఫిళ్ళలో నింపాల్సి రావటంతో హిందూ ముస్లిం సిపాయిలు వాటిని వాడటానికి నిరాకరించారు. ఆయితే బ్రిటీష్ వారు ఆ తూటాలను మార్చామనీ, కొవ్వులను తేనె పట్టునుండీ లేదా నూనెగింజలనుండీ సొంతంగా తయారు చేసుకోవటాన్ని ప్రోత్సహించామని చెప్పినప్పటికీ అవి సిపాయిలకు నమ్మకాన్ని కలిగించలేక పోయాయి.

1857 మార్చినెలలో 34వ దేశీయ పదాతిదళానికి చెందిన మంగళ్ పాండే అనే సైనికుడు బ్రిటిష్ సార్జంట్ మీద దాడిచేసి అతని సహాయకుని గాయపరచాడు. జనరల్ హెన్రీ మగళ్ పాండేని మతపిచ్చి పట్టినవాడిగా బావించి, మంగళ్ పాండేని బంధించమని జమేదార్ని ఆజ్ఞాపించటం, జమేదార్ అతని ఆజ్ఞని తిరస్కరించటంతో తిరుగుబాటు మొదలయిందని చెప్పవచ్చు. బ్రిటీష్ వారు మంగళ్ పాండేని,జమేదార్నుఏప్రిల్ 7న ఉరితీసి, దళం మొత్తాన్నీ విధులనుండి బహిష్కరించారు. మే 10న 11వ, 20వ అశ్వదళం సమావేశమై అధికారులను ధిక్కరించి 3వ పటాలాన్ని విడిపించారు. మే 11న ఇతర భారతీయులతో కలసి సిపాయిలు ఢిల్లీ చేరుకొని చివరి మొగలు చక్రవర్తి బహదూర్‌షా 2 నివాసమైన ఎర్రకోటని ఆక్రమించి చక్రవర్తిని ఢిల్లీసుల్తాన్ గా తిరిగి అధికారాన్ని స్వీకరించాల్సిందిగా వత్తిడి చేసారు. బహదూర్‌షా మొదట అంగీకరించకపోయినా, తరువాత ఒప్పుకొని తిరుగుబాటుకు నాయకత్వాన్ని వహించాడు.

ఇలా ప్రారంభమైన తిరుగుబాటు, వేగంగా ఉత్తర భారతం మొత్తానికి నిస్తరించింది. మీరట్, ఝాన్సీ, కాన్పూర్, లక్నోలు తిరుగుబాటు తలెత్తిన ముఖ్యప్రాంతాలు. బ్రిటిష్ వారు మొదట వేగంగా స్పందించనప్పటకీ, తరువాత తీవ్రమైన బలప్రయోగంతో తిరుగుబాటుని అణచివేసేందుకు యత్నించారు. వారు క్రిమియన్ యుద్దంలో పాల్గొన్న పటాలాలనీ, చైనా వెళ్ళేందుకు బయలుదేరిన ఐరోపా పటాలాలని తిరుగుబాటును అణచివేసేందుకు వినియోగించారు. తిరుగుబాటుదారుల ప్రధాన సైన్యానికి, బ్రిటిష్ వారికీ ఢిల్లీకి దగ్గరలోని బద్ల్-కీ-సరై లో యుద్దం జరిగింది. ఈ యుద్దంలో బ్రిటిష్ సైనికులు మొదట తిరుగుబాటుదారులని ఢిల్లీకి పారద్రోలి తరువాత ఢిల్లీని ఆక్రమించారు. ఢిల్లీ ఆక్రమణ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 న పూర్తయింది. ఈ యుద్ధంలో ఒకవారంపాటు అడుగడుగునా వీధిపోరాటం జరిగింది. అయితే తిరుగుబాటుదారుల మీద బ్రిటీష్ వారు విజయం సాధించి నగరాన్ని తిరిగి ఆక్రమించారు. జూన్ 20న గ్వాలియర్‌లో చివరి ముఖ్యపోరాటం జరిగింది. ఈ పోరాటంలో రాణీ లక్ష్మీబాయి మరణించింది. ఆయితే చెదురుమదురు పోరాటాలు 1859 లో తిరుగుబాటుదారులను పూర్తిగా అణచివేసేవరకూ జరిగాయి. ఔధ్ రాజు అంతరంగికుడైన అహ్మదుల్లా, నానా సాహిబ్ మరియూ రావ్ సాహిబ్ పరివారము, తాంతియా తోపే, అజ్ముల్లాఖాన్, రాణీ ఝాన్సీ లక్ష్మీబాయి, కున్వర్సింగ్, బీహారులోని రాజపుత్ర నాయకుడైన జగదీష్పూర్, మొగలుచక్రవర్తి బంధువైన ఫిరోజ్ షా, బహదూర్షా 2, ప్రాణ్ సుఖ్ యాదవ్ మరియూ రెవారి బ్రిటీష్ వారిని ఎదిరించిన తిరుబాటుదారులలోని ముఖ్య నాయకులు.



తిరుగుబాటు తదనంతర పరిణామాలు:--

1857 తిరుగుబాటు భారతదేశ చరిత్రలో ఒక ముఖ్య మలుపుగా చెప్పవచ్చు. బ్రిటీష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను రద్దుచేసి విక్టోరియా రాణి పరిపాలనను ప్రవేశపెట్టారు. భారత పాలనావ్యవహారాలను చూసుకోవటానికి వైస్రాయిని నియమించారు. ఈవిధంగా భారతదేశం నేరుగా బ్రిటీష్ పాలనలోకి వచ్చింది. తన పాలనలో భారతదేశ ప్రజలకు సమాన హక్కులు కల్పిస్తానని బ్రిటీష్ రాణి ప్రమాణం చేసింది, అయినప్పటికీ బ్రిటిష్ వారిపట్ల భారత ప్రజలకు అనుమానాలు తొలగలేదు. ఈ అనుమానాలు 1857 తిరుగుబాటు అనంతరం విస్తృతమయ్యాయి.

బ్రిటిష్ వారు తమ పాలనలో అనేక రాజకీయ సంస్కరణలను ప్రవేశపెట్టారు. భారతదేశంలోని అగ్రవర్ణాల వారిని, జమీందారులను పరిపాలనలో భాగస్వాములను చేసారు. భూఆక్రమణలకు స్వస్తి పలికారు, మతవిషయాలలో ప్రభుత్వ జోక్యం నిలిపివేసారు. బారతీయులను ప్రభుత్వ ఉద్యోగాలలోకి అనుమతించారు, అయితే ఆచరణలో క్రిందితరగతి ఉద్యోగాలకే పరిమితం చేసారు. సైన్యంలో బ్రిటిష్ సైనికుల నిష్పత్తిని పెంచటం, ఫిరంగులు మొదలయిన భారీ అయుధాలను బ్రిటిష్ సైనికులకే పరిమితం చేసారు. బహదూర్‌షాను దేశ బహిష్కృతుని గావించి బర్మాకి తరలించారు. 1862 లో అతను బర్మాలో మరణించటంతో భారతరాజకీయాలలో మొగలాయిల వంశం అంతమైందని చెప్పవచ్చు. 1877 లో బ్రిటన్ రాణి, తనను భారతదేశానికి రాణిగా ప్రకటించుకుంది.



సంఘటిత ఉద్యమాలు:--


సిపాయిల తిరుగుబాటు తరువాతి దశాబ్దాల్లో భారతదేశంలో రాజకీయ చైతన్యం హెచ్చింది. రాజకీయాలలో భారత ప్రజల వాణి విన్పించసాగింది. అంతేకాక, జాతీయస్థాయిలోను, ప్రాంతీయస్థాయిలోను అనేకులు భారత ప్రజలకు నాయకత్వం వహించసాగారు. దాదాభాయి నౌరోజీ 1867 లో ఈస్ట్ ఇండియా ఆసోసియేషన్ (తూర్పు భారతీయ సంఘం ) బు స్థాపించాడు. 1867 లో సురేంద్రనాథ్ బెనర్జీ ఇండియన్ నేషనల్ అసోసియేషన్ (భారత జాతీయ సంఘం) స్థాపించాడు. పదవీవిరమణ చేసిన బ్రిటీష్ ప్రభుత్వ ఉద్యోగి అలన్ ఆక్టేవియస్ హ్యూమ్ ప్రోత్సాహంతో బొంబాయి (ముంబాయి)లో సమావేశమైన 73 మంది భారత ప్రతినిధులు భారత జాతీయ కాంగ్రెస్ ని స్థాపించారు. వివిధరాష్ట్రాలకు చెందిన వీరిలో చాలామంది పాశ్చాత్యవిద్య నభ్యసించి న్యాయ, పాత్రికేయ, విద్యారంగాల వంటి వృత్తులలో ఉన్నవారు. కాంగ్రెస్ ఏర్పాటైన కొత్తలో ఏవిధమైన సిద్ధాంతాలు లేక, కేవలం అనేక అంశాలపై చర్చలకు పరిమితమై బ్రిటిష్ పాలన పట్ల అనుకూలతను వ్యక్తంచేయటానికే పరిమితమైంది. ప్రతి వార్షిక సమావేశాలలో ప్రాథమిక హక్కులు, పౌరసేవలలో, ప్రభుత్వంలో భారతీయ బాగస్వామ్యం మెదలైన తక్కువ వివాదాస్పదమైన విషయాలలో అనేక తీర్మానాలను చేయటానికి పరిమితమైంది. ఈ తీర్మానాలను వైస్రాయికి, కొన్నిసార్లు బ్రిటిష్ పార్లమెంటుకూ నివేదించేవారు. అయితే తొలినాళ్ళలో కాంగ్రెస్ సాధించింది చాలా స్వల్పం. భారత ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పుకున్నప్పటికీ, కేవలం నగరాలలో నివసించే శిష్టజనవర్గానికే కాంగ్రెస్ పరిమితమైంది. ఇతరవర్గాలకి కాంగ్రెస్‌లో ప్రాతినిధ్యం నామమాత్రమేనని చెప్పవచ్చు.

ఆర్య సమాజము, బ్రహ్మ సమాజము మొదలైన మతసమాజములు సంఘసంస్కరణలకు మిక్కిలి కృషి చేసాయి. మతసంస్కరణలు, సాంఘిక గౌరవం మెదలయిన విషయాలలో వీరి బోధనలు జాతీయతాభావనకు పునాదులు వేసాయి. ప్రజలు తమను భారత జాతిగా గుర్తించసాగారు. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, రామకృస్ణ పరమహంస, శ్రీ అరబిందో, సుబ్రమణ్య భారతి, బకించంద్ర చటర్జీ, సర్ సయ్యద్ ఖాన్, రవీంద్రనాథ్ టాగూర్, దాదాభాయి నౌరోజీ మెదలయినవారి కృషి జాతి పునరుత్తేజం పట్ల, స్వేచ్ఛ పట్లా ప్రజల్లో ఇచ్ఛను వ్యాపింపజేసింది.

1900 నాటికి కాంగ్రెసు అఖిల భారత స్థాయిని చేరుకున్నప్పటికీ, ముస్లిములను ఆకట్టుకోలేకపోయిన వైఫల్యం దాని విజయాల స్థాయిని తగ్గించింది. మతమార్పిడిపై హిందూ సంస్కర్తల దాడులు, గోసంరక్షణ, ఉర్దూను అరబిక్ లిపిలోనే ఉంచడం మొదలైన కారణాలవల్ల ముస్లిములు తమ అల్పసంఖ్యాక గుర్తింపు, హక్కులు కోల్పోతామన్న భయంతో కాంగ్రెసును భారతీయుల ఏకైక ప్రతినిధిగా అంగీకరించలేదు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లిమ్ పునరుత్తేజ ఉద్యమం, 1875లో, ఆలీఘర్ లో మహ్మదీన్ ఆంగ్లో-ఓరియంటల్ కాలేజి (నేటి అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ) స్థాపనకు దారితీసింది. దాని ముఖ్యోద్దేశం ఇస్లాం మరియూ నూతన పాశ్చాత్య విజ్ఞానాల మేళవింపుతో విద్యాబోధన చేయడం. కాని, భారత ముస్లిములలో ఉన్న భిన్నత్వం వారిలో సాంస్కృతిక, సైధ్ధాంతిక ఏకత్వాన్ని సాధించలేక పోయింది.


భారత జాతీయవాద పుట్టుక:--


ప్రభుత్వ సంస్థలలో ప్రాతినిధ్యం, తమ వాణిని వినిపించే అవకాశం, శాసనాలను రూపొందిచడంలోనూ భారతదేశ పరిపాలనా వ్యవహారాలలోనూ ఓటు సంపాదించడం లాంటివి కాంగ్రెసు సభ్యులలో జాతీయవాదానికి అంకురార్పణ చేశాయి. కాంగ్రెసు వాదులు తమను తాము స్వామిభక్తులుగా భావిస్తూ, బ్రిటిషు సామ్రాజ్య భాగంగానే, తమ దేశ పరిలపాలనలో భాగస్వామ్యాన్ని ఆశించారు. దాదాభాయి నౌరోజి, బ్రిటిషు వారి హౌస్ ఆఫ్ కామన్స్ కు పోటీచేసి గెలిచిన మొదటి భారతీయుడిగా, ఈ ఆలోచనావిధానానికి ఒక మూర్తిభవించిన ఉదాహరణగా నిలిచారు.

బాల గంగాధర తిలక్ మొదటిసారిగా "స్వరాజ్య" వాదాన్ని వినిపించిన జాతీయవాది. తిలక్ భారతీయ సంస్కృతిని, చరిత్రను, విలువలను నిర్లక్ష్యం చేస్తూ, కించపరిచేదిగా ఉన్న బ్రిటిష్ విద్యావ్యవస్థను తీవ్రంగా నిరసించాడు. జాతీయ వాదులకు భావ ప్రకటనా స్వాతంత్ర్యం లేక పోవడాన్ని సహించలేకపోయాడు. సామాన్య భారతీయుడికి తమ దేశపు వ్యవహారాలలో ఏ విధమైన పాత్ర లేకపోవడాన్ని కూడా నిరసించాడు. వీటన్నిటినీ అధిగమించడానికి "స్వరాజ్యమే" సహజమైన, ఏకైక మార్గమని నమ్మాడు. "స్వరాజ్యం నా జన్మహక్కు" అనే ఆయన నినాదం భారతీయులందరికి స్ఫూర్తిదాయకమైంది.

తిలక్ మార్గాలు అతివాద మార్గాలుగా భావింపబడ్డాయి. ప్రజలు, బ్రిటిషు వారిపై తిరుగబడటమే స్వరాజ్య సాధనా మార్గంగా భావించారాయన. బ్రిటిషు వారివైన అన్ని వస్తువులను త్యజించాలని పిలుపునిచ్చారు. బిపిన్ చంద్ర పాల్,లాలా లజపతి రాయ్ వంటి వర్ధమాన ప్రజానాయకులు ఆయనను సమర్ధించారు. ఈ ముగ్గురూ "లాల్, బాల్, పాల్"గా ప్రసిధ్ధులు. భారత దేశపు అతి పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, బెంగాల్, పంజాబులు భారత ప్రజల ఆకాంక్షలకు, జాతీయవాదానికి రూపురేఖలను కల్పించాయి.

హింస, అవ్యవస్థలను తిలక్ ప్రోత్సహిస్తున్నారని గోఖలే విమర్శించారు. కాంగ్రెసులో ప్రజా ప్రాతినిధ్యం లేనందున తిలక్ ఆయన అనుయాయులు కాంగ్రెసును విడువవలసి వచ్చింది. దీనితొ కాంగ్రెసు 1907లో రెండు ముక్కలయింది.

తిలక్ అరెస్టుతో భారతీయ తిరుగుబాటుపై అన్ని ఆశలు అడుగంటాయి. కాంగ్రెసు ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. రాబోతున్న రాజ్యాంగ సవరణలలో మినహాయింపులను, ప్రభుత్వ ఉద్యోగాలలోను, నియోజకవర్గాలలోనూ ప్రత్యేక గుర్తింపును కోరుతూ ఒక ముస్లిమ్ ప్రతినిధి దళం వైస్రాయి గిల్బర్ట్ ఇలియట్-ముర్రే-కైనమండ్, 4వ మింటొ Earl(1905-10)ని కలిసింది. బ్రిటిషు ప్రభుత్వం వారి కొన్ని కోరికలను మన్నిస్తూ, ముస్లిములకై ప్రత్యేకించిన ప్రతినిధిత్వ స్థానాలను పెంచిందిభారత ప్రభుత్వ శాసనము 1909. ముస్లిమ్ లీగు, హిందువులతో నిండిన కాంగ్రెసు నుండి తాము వేరని, తమ వాణి "దేశంలో దేశంయొక్క" వాణి అని నొక్కి చెప్పింది.



బెంగాల్ విభజన(1905);--



ప్రాంతీయ మరియూ రాష్ట్రీయ రాజకీయాలపై బెంగాలీ సంస్థానంలోని హిందూ మేధావుల ప్రభావం చాల ఎక్కువగా ఉండేది. జనాభా ఎక్కువగా ఉన్న ఈ చాలా పెద్ద సంస్థానాన్ని పరిపాలనా సౌలభ్యం పేరుతో, అప్పటి వైస్రాయి, గవర్నర్-జనరల్ (1899-1905) అయిన కర్జన్ రెండు భాగాలుగా చేయాలని ఆదేశించాడు. దరిమిలా ఢాకా రాజధానిగా, అస్సాంతో చేరి తూర్పు బెంగాలు, అప్పటికే బ్రిటిషు రాజధానిగా ఉన్న కలకత్తా రాజధానిగా పశ్చిమ బెంగాలు ఆవిర్భవించాయి. ఈ ఆదేశం పై బెంగాలీలు మండిపడ్డారు. దీనికి వ్యతిరేకంగా వీధి వీధినా ఉద్యమాలు జరిగాయి. పత్రికల ద్వారా ఆ ఉద్యమాలకు ప్రాచుర్యం లభించింది. ప్రజాభీష్టానికి విరుధ్ధంగా, వారి భావాలకు విలువనివ్వకుందా చేసిన ఈ పని బ్రిటిషు వారి "విభజించి పాలించే" పద్దతికి అద్దం పట్టింది. కాంగ్రెసు "స్వదేశీ" నినాదాన్నిచ్చి, బ్రిటిషు వస్తువుల బహిష్కారానికి పిలుపునిచ్చింది. ప్రజలు ఒకరికొకరు రక్షాబంధనాలను కట్టుకొని తమ సమైక్యతను ప్రదర్శించారు. ఈ రోజుల్లో రవీంద్రనాధ టాగోర్ దేశభక్తి గీతాల్ని రచిస్తూ, ఆలపిస్తూ ప్రజలను ముందుకు నడిపారు.

బెంగాలు విభజనకాలంలో కొత్త పద్దతులలో ఉద్యమాలు జరిగాయి. ఇవే స్వదేశీ, బహిష్కరణ మార్గాలు. కాంగ్రెసువారి విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం, సిపాయిల తిరుగుబాటు స్థాయిలో బ్రిటిషు వారిపై ప్రజా వ్యతిరేకతను పెంచగలిగింది. హింస, అణచివేతల చక్రభ్రమణం దేశంలో పలుచోట్ల జరిగింది (చూడుడుఆలీపూర్ విస్ఫొటనం). బ్రిటిషు వారు ఈ సంకట స్థితిలో నుండి బయటపడడానికి కొందరు మితవాదులకు రాజాస్థాన, సంస్థాన పదవులు ఇచ్చి, 1909లో కొన్ని రాజ్యాంగ సవరణలను తెచ్చారు. ఐదవ జార్జి రాజు 1911లో జరిపిన,బ్రిటిషు వారు సుహృద్భావ పర్యటనగా భావించే పర్యటనలో దర్బారు (దాసులు సార్వభౌమునికి విధేయతను ప్రకటించే నిండు పేరోలగం)లో బెంగాల్ విభజన రద్దును, రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి దక్షిణాన ఒక పధకం ప్రకారం నిర్మింపబడుతున్న నగరానికి మార్పును ప్రకటించాడు.

23 డిసెంబరు 1912న రాజధాని మార్పు సందర్భంగా జరిగిన సంబరాలలో వైస్రాయి లార్డ్ హర్డింగ్ పై జరిగిన హత్యాప్రయత్నం ఢిల్లీ-లాహోర్ కుట్రగా చరిత్రకెక్కింది.



మొదటి ప్రపంచ యుద్ధం:--



మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో బ్రిటిషు వారు భారత దేశంలో తిరుగుబాటును శంకించారు. వారిని ఆశ్చర్యపరుస్తూ భారతదేశంలోని ముఖ్య నాయకులందరూ బ్రిటిషు వారికి అపూర్వమైన సహాయ సహకారాలనందించారు. మానవ, మానవేతర వనరులను సమకూర్చి భారత్ బ్రిటిషు యుధ్ధ ప్రయత్నానికి కొడంత అండగా నిలిచింది. సుమారు 13 లక్షల మంది భారతీయులు సైనికులుగానో, పనివారలగానో ఐరోపా, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యాలలో పనిచేశారు. భారత ప్రభుత్వము, అప్పటి రాజవంశాలు పెద్ద ఎత్తున భోజన వస్తువులను, ధనాన్ని, మందుగుండు సామగ్రిని అందజేశాయి. కాని పంజాబు, బెంగాలులలో బ్రిటిషు వ్యతిరేకాగ్ని రగులుతూనే ఉంది. బెంగాలు జాతీయ వాదం, పంజాబులో అశాంతి చేతిలో చేయిగా స్థానిక పరిపాలనను స్థంభింపజేశాయి.[2][3] యుధ్ధ ప్రారంభం నుండి ప్రవాసభారతీయులు, ముఖ్యంగా అమెరికా, కెనడా మరియూ జర్మనీలలో ఉన్నవారు, బెర్లిన్ కమిటీ, గదర్ పార్టీల ఆధ్వర్యంలో భారతదేశంలో ఐరిష్ రిపబ్లిక్, జర్మనీ మరియు టర్కీల సహాయంతో 1857 తరహా తిరుగుబాటు జరుప తలపెట్టిన భారీ ప్రయత్నం హిందూ-జర్మన్ కుట్రగా పేరొందింది.[4][5][6] ఈ కుట్రలో భాగంగా ఆఫ్ఘనిస్థానును కూడా బ్రిటిషు భారత్ పై ఉసిగొల్ప ప్రయత్నం జరిగింది.[7] తిరుగుబాట్లకు జరిగిన అనేక ప్రయత్నాలలో ఫిబ్రవరి తిరుగుబాటు, సింగపూరు తిరుగుబాటు ముఖ్యమైనవి. ఈ ప్రయత్నాలన్నీ గట్టి అంతర్జాతీయ గూఢచర్యంతోనూ, కౄరమైన చట్టాల (భారత రక్షణ చట్టం 1915సహా)తోనూ పది సంవత్సరాలపాటు అణచివేయబడ్డయి.[8][9]

మొదటి ప్రపంచ యుధ్ధానంతరం, యుధ్ధంలో జరిగిన భారీ ప్రాణనష్తం, పెరిగిన పన్నులతో మరింత పెరిగిన ద్రవ్యోల్బణం, సర్వవ్యాపకమైన ఫ్లూ మహమ్మారి, మందగించిన వ్యాపారాలు భారత ప్రజల బ్రతుకులను మరింత కష్టతరం చేసాయి. బ్రిటిష్ పాలననంతమొందిచడానికి భారత సైనికులు దేశంలోకి ఆయుధాలను దొంగతనంగా తెచ్చారు. కాంగ్రెసు లోని మితవాద, అతివాద గుంపులు మరల కలసి పనిచేయడంతో యుధ్ధపూర్వ జాతీయవాదం పునర్జీవితమైంది. 1916లో రాజకీయాధికారాల పంపిణీ, దేశంలో ఇస్లాం భవితవ్యాలపై కాంగ్రెసు, ముస్లిం లీగు ఒక ఒప్పందం చేసుకున్నాయి. దీనికి లక్నో ఒప్పందం అని పేరు.

బ్రిటిషర్లు మొదటి ప్రపంచ యుద్ధంలోభారత దేశ సహాయానికి ప్రతిఫలంగా భారత జాతీయవాద కోర్కెలపై చూద్దాం,చేద్దాం పద్ధతినే అవలంబించారు. 1917 ఆగస్టులో భారత ప్రభుత్వ కార్యదర్శి అయినఎడ్విన్ శామ్యూల్ మోంటగు, భారత చట్టసభలో ఈ క్రింది ప్రాముఖ్యమైన ప్రకటన చేశాడు."భారత దేశంపై ఆంగ్లేయుల దృక్పథం ఏమిటంటే ప్రతి నిర్వహణా శాఖలోనూ భారతీయుల సంఖ్యను,ప్రాముఖ్యతనూ పెంచుతూ,స్వయం నిర్వహణా వ్యవస్థలని క్రమంగా అబివృద్ధి చేసి ఒక అబివృద్ధి కాముకమైన ప్రభుత్వాన్ని భారత దేశంలో ఏర్పాటుచేసి,ఈ దేశాన్ని బ్రిటిష్ సార్వభౌమాధికార సామ్రజ్యంలోని అవిభాజ్య భాగంగా తయారు చెయ్యడం". ఈ కలని సాకారంచేసే ప్రయత్నం భారత్ ప్రభుత్వ చట్టం1919 లోకనిపించింది.ఆ చట్టం ద్వంద నిర్వహణా విధానాన్నిప్రవేశపెట్టింది.దీంట్లో భారతదేశం నుండి ఎన్నుకోబడిన శాసనకర్తలు,బ్రిటీషు ప్రభుత్వం నియమించిన అధికారులు అధికారాన్నిపంచుకుంటారు. ఈ చట్టం కేంద్రీయ,ప్రాంతీయ శాసనసభలనీ,వోటు హక్కునీ విస్తృత పరచింది.ద్వంద నిర్వహణా విధానం అమలు కాగానే ప్రాంతీయ పరిధిలో అనేక మార్పులు వచ్చాయి.అనేకమైన అవివాదాస్పద మంత్రిత్వ శాఖలు,వ్యవసాయం,ప్రాంతీయ ప్రభుత్వాలు,ఆరోగ్యం,విద్య,ప్రజా పనులు లాంటివి భారతీయులకి ఒప్పచెప్పి, సున్నితమైన ఆర్ధిక శాఖ,పన్నులు,శాంతి భద్రతలు మాత్రం ప్రాంతీయ బ్రిటీషు నిర్వాహకులు అట్టిపెట్టుకున్నారు.


భారత్ కు గాంధీ ఆగమనం:--


మోహన్ దాస్ గాంధీ దక్షిణాఫ్రికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు. భారత దేశంలో నిరంకుశమైన రౌలట్ చట్టం, కూలీల పట్ల వివక్షనూ వ్యతిరేకిస్తూ తన గళాన్ని వినిపించాడు. ఈ ఆందోళనల సమయంలో గాంధీజీ సత్యాగ్రహం అనే ఉద్యమాన్ని తెరపైకి తీసుకుని వచ్చాడు. దీనికి స్ఫూర్తి పంజాబ్ ప్రాంతంలో 1872 లో బాబా రామ్ సింగ్ ప్రారంభించిన కూకా ఉద్యమం. ఈ ఉద్యమాలు ముగిసే సమయానికి దక్షిణాఫ్రికాలో జాన్ స్మట్స్ నాయకత్వంలోని ప్రభుత్వం నిరంకుశ చట్టాలను అధికారికంగా వెనక్కు తీసుకుంది.

ఇరవై సంవత్సరాల తర్వాత భారతదేశానికి తిరిగివచ్చిన గాంధీకి ఇక్కడి పరిస్థితులు, రాజకీయాలు కొత్త. అప్పట్లో కాంగ్రెస్ కావాలని అడుగుతున్న ఉమ్మడి వ్యాపార సామ్రాజ్యాన్ని సమర్ధించాడు. ఆంగ్లేయులు భారతదేశానికి తీసుకువచ్చిన పారిశ్రామిక అభివృద్ధి, విద్యాభివృద్ధి అప్పుడు దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారంగా భావించాడు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతయైన గోపాలక్రిష్ణ గోఖలే గాంధీకి మార్గదర్శకుడిగా మారారు. గాంధీజీ ప్రతిపాదించిన అహింసా పూరిత సహాయ నిరాకరణ ఉద్యమం మొదట్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులకు రుచించలేదు. గాంధీ మాటల్లో చెప్పాలంటే సహాయ నిరాకరణ అంటే అధర్మపూరితమైన ప్రభుత్వ పరిపాలనను నిరసిస్తూ పౌరులు తమ వెల్లడించే అభిప్రాయం. దాన్ని అహింసాయుతంగా నిర్వహించాలి". అలా గాంధీ రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఎన్నో లక్షలమంది సామాన్య ప్రజల్లో స్పూర్తి రగిల్చగలిగాడు.

గాంధీజీ దూరదృష్టి ఎంతో మందిని జాతీయ స్వాతంత్ర్యోద్యమ పోరాటంలోకి ఆకర్షించింది. ఈ ఉద్యమంలో భారతీయ వృత్తులు, పరిశ్రమలు వాటి మీద ఆధారపడి జీవితున్న ప్రజల పరిరక్షణ కూడా ఒక భాగం. ఉదాహరణకు బీహార్ లోని చంపారన్ లోవాణిజ్య పంటలను బలవంతంగా పండించమని పేదరైతులను బలవంతం చేస్తూ, వారి నుంచి అన్యాయంగా అధిక మొత్తంలో పన్నులు వసూలు చేస్తూ వారికి ఆహార ధాన్యాలు కూడా సరిగా అందుబాటు లో లేకుండా చేసే ప్రభుత్వ విధానాలపై పోరాడి విజయం సాధించారు.



రౌలట్ చట్టం దాని తదనంతర పరిణామాలు:---


1919 లో చేయబడిన రౌలట్ చట్టం సంస్కరణల సత్ఫలితాలను తీవ్రంగా తగ్గించి వేసింది. బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్వతిరేకంగా జరిగిన హిందూ-జర్మన్ కుట్ర, భారతదేశంలో మొదలయిన సాయుధ పోరాటాలలో జర్మన్ మరియు బోల్ష్విక్ ల పాత్ర ల పై విచారణచేయటానికి సాంమ్రాజ్య విధాన మండలి (ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్)చే నియమించ బడిన రౌలట్ అధికార సంఘం (రౌలట్ కమీషన్) సిఫార్సులకణుగుణంగా రౌలట్ పేరుపై ఈ చట్టం చేయబడినది. చీకటి చట్టంగా పరిగణింపబడిన రౌలట్ చట్టం వైస్రాయి పభుత్వానికి కుట్రని విచ్ఛినం చేయటానికనే సాకుతో వార్తాపత్రికలపై ఆంక్షలువిధించటం, రాజకీయ కార్యకర్తలను విచారణ లేకుండానే బహిష్కరించటం, సామ్రాజ్యానికి వ్యతిరేకంగా కుట్రకు పాల్పడుతునారనే అనుమానంపై ఏ వ్యక్తినైనా ధృవీకరించకనే నిర్భంధించటం లాంటి విశేష అధికారాలను దకలు పరిచింది. ఈ చట్టానికి నిరసనగా హర్తాళ్ కి పిలుపునివ్వటంతో దేశవ్యాప్తంగా కాక పోయినప్పటికీ విస్తృతంగా వ్యతిరేకత ప్రభలింది..[10][11][12]

1919 ఎప్రల్ 13న ఈ ఆందోళనలకు పరాకాష్ఠగా జలియన్ వాలాబాగ్ దురంతం జరిగింది, ఈ దురంతానికే అమృత్సర్ మారణకాండ అని కూడా పేరు. పంజాబ్ లోని అమృత్సర్ లో చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలపటానికి నాలుగు గోడల మద్య జలియన్ వాలాభాగ్ లో సమావేశమైన 5000 మంది అమాయక నిరాయుధ ప్రజలపై రెజినాల్డ్ డైయ్యర్ అనే బ్రిటీష్ సైనికాధికారి ప్రధాన ధ్వారాన్ని మూసివేసి విచక్షణా రహితంగా కాల్పులకు ఆదేశించాడు. మొత్తం 1,651 మార్లు చేసిన కాల్పులలో 379 మంది ప్రజలు మరణించారని 1,137 మంది గాయపడినారని బ్రిటీష్ వారి అధికారిక అంచనా. అయితే మొత్తం 1,499 మందిదాకా మరణించారని భారతీయుల అంచనా.ఈ దారుణ మారణకాండతో స్వపరిపాలనపై మొదటి ప్రపంచ యుద్ధసమయంలో భారతీయులలో చిగురించిన ఆశలు అడియాశలైనాయి. [13])




సహాయ నిరాకరణోద్యమాలు:--

మొదటి ప్రపంచ యుద్ధసమయంలో జరిగిన మొదటి స్వాతంత్ర్యోద్యమము వ్యాపారాత్మక ప్రదేశాలకే పరిమితమై దేశ ఏకీకరణకు పిలుపునివ్వక సామాన్య ప్రజలకు దూరంగానే నిలిచిపోయిందని చెప్పవచ్చు. 1930వ దశకంలో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ భారత రాజకీయాలలోకి ప్రవేశించటంతో దేశ ఏకీకరణ ప్రారంభమైనది.



మెదటి సహాయ నిరాకరణోద్యమము:--


మెదటి సత్యాగ్రహ ఉద్యమము బ్రిటన్ నుండి దిగుమతి చేసుకునే మిల్లు వస్త్రాలకు మారుగా భారతదేశంలో తయారయిన ఖద్దర్ని ఉపయోగించాలని పిలుపునిచ్చింది, అదియే కాక బ్రిటీషు విద్యాసంస్థలను మరియు న్యాయస్థానాలని బహిష్కరించాలని, ప్రభుత్వ ఉద్యోగాలను విడనాడాలని, పన్ను చెల్లింపులు నిలిపివేయాలని, బ్రిటీష్ వారి సత్కారాలను, బిరుదులను తిరస్కరించాలని పిలుపునిచ్చింది. 1919 లో చేయబడిన నూతన భారత ప్రభుత్వ చట్టాన్ని ప్రభావితం చేయటంలో చాలా ఆలస్యంగా ప్రారంభమైన సత్యాగ్రహోద్యమము విఫలమైనప్పటికీ భారత దేశంలో విస్తృత ప్రజాదరణ పొందింది. తత్ఫలితంగా పెద్దయెత్తున పాలనను స్తంభింపజేసి విదేశీ పాలనకు తీవ్రమైన ఒడిదుడుకులను కలిగించింది.అయితే ప్రజాగ్రహానికి గురియై 21 మంది రక్షకబటులు మరణించిన చౌరి చౌరా సంఘటనతో గాంధీ మెదటి సత్యాగ్రహోద్యమాన్ని విరమించాడు

1920 లో కాంగ్రెస్ ను పునర్వవస్థీకరించి నూతన విధివిధానాలు రూపొందించారు. స్వరాజ్యం వీటి లక్ష్యం.కాంగ్రెస్ సభ్యత్వనమోదు సరళీకరింపబడి నామమాత్రపు రుసుము చెల్లించటానికి అంగీకరించిన వారందరికీ అందుబాటులోకి పచ్చింది. స్వేచ్ఛాయుత విధానాల స్థానే నిర్ధిస్ట నియంత్రణ కలిగి క్రమశిక్షణను పెంపొదించేందుకు అనేక స్థాయిలలో సంఘాలను ఏర్పరిచారు. వీటన్నిటి ఫలితంగా శిష్ఠజన వర్గాలకే పరిమితమైన సంస్థ నుండి జనాధరణ మరియు జన భాగస్వామ్యం గల రాజకీయ పక్షంగా కాంగ్రెస్ రూపాంతరం చెందింది.

1922 లో గాంధీకి ఆరుసంత్సరాల కారాగార శిక్ష విధించారు, కానీ రెండు సంవత్సరాల కారాగార వాసానంతరం విడిచి పెట్టారు. కారాగారవాసం తరువాత గాంధీ సబర్మతీ నదీ తీరంలో సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించాడు. అచటినుండీ యంగ్ ఇండియా అనే వార్తాపత్రికను నడపటంతో పాటు హిందూ సమాజంలో వెనకబడిన, దళిత, అస్పృశ్య, పేద ప్రజల కోసం అనేక సంఘ సంస్కరణలను ప్రారంభించారు.

ఈ కాలంలోనే కాంగ్రెస్ పార్టీలోకి క్రొత్త తరం ప్రవేశించింది. చక్రవర్తి రాజగోపాలాచారి, జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ మరియు సుభాష్ చంద్రబోస్ వీరిలో కొందరు. తరువాతి కాలంలో వీరు గాంధేయవాద విలుపలననుసరించినా వాటితో విభేదించినా (భారత జాతీయ సైన్యం) భారత స్వాతంత్ర్య వాణిని స్పష్టంగా వినిపించారు.

భారత రాజకీయాలు స్వరాజ్య పార్టి, హిందూ మహాసభ, కమ్యునిష్ట్ పార్టి ఆఫ్ ఇండియా మరియు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వంటి అనేక మితవాద, అతివాద సంస్థల ఆవిర్భావంతో విస్తృతమయ్యాయి. మద్రాసులో బ్రాహ్మణేతరుల, మహారాష్ట్రలో మాహరుల, పంజాబులో సిక్కుల ప్రయోజనాలకు ప్రాంతీయ రాజకీయ పక్షాలు ప్రాతినిధ్యం వహించాయి. మహాకవి సుబ్రమణ్య భారతి, వన్చినాథన్ మరియు నీలకండ బ్రహ్మచారి వంటీ బ్రాహ్మణ ప్రముఖులు కూడా తమిళనాడులో స్వాతంత్ర్య సాధనకు మరియు అన్ని కులాల ప్రజల సమానత్వానికై పోరాడారు.



సంపూర్ణ స్వతంత్ర్యము (పూర్ణ స్వరాజ్):--


భారతీయులు 1928 మేలో సైమన్ సంఘం (సైమన్ కమీషన్) యొక్క సిఫార్సులను తిరస్కరించి బొంబాయిలో సర్వ పక్ష సభను నిర్వహించారు.ప్రజలలో బ్రిటీష్ పాలనపై వ్యతిరేకతను పెంపోందించటం ఈ సభ ముఖ్య ఉద్దేశం.ఈ సభ భారత రాజ్యాంగ నిర్మాణానికి మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ముసాయిదా సంఘాన్ని నియమించింది. కాంగ్రెస్ కలకత్తా సమావేశాలలో 1929 డిసెంబర్ లోగా బ్రిటీష్ ప్రభుత్వం భారత దేశానికి స్వపరిపాలన హోదా నివ్వాలని లేదా దేశ వ్యాప్తంగా సత్యాగ్రహాని ప్రారంభిస్తామని తీర్మానించింది.ఆయితే 1929 కల్లా పెరిగిన రాజకీయ అసంతృప్తి, ప్రాంతీయ ఉద్యమాలలో పెరిగిన హింస కాంగ్రెస్ నాయకులలో సంపూర్ణస్వరాజ్యం కోరకు పిలుపునివ్వాలనే కోరికను పెంచాయి. జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన 1929లో జరిగిన చారిత్రాత్మక లాహోర్ సమావేశం సంపూర్ణ స్వాతంత్ర్యమునకు పిలుపునిచ్చింది. 1930 జనవరి 26న భారతదేశంమెత్తం సంపూర్ణ స్వాతంత్ర్యదినంగా పాటించాలని నిర్ణయించింది. భారత దేశంలోని వివిధ రాజకీయపక్షాలు,విప్లవకారులు సంపూర్ణ స్వతంత్ర్యదినోత్సవాన్ని సగర్వంగా,సగౌరవంగా జరుపుకోవటానికి ఒక్కటైనారు.



ఉప్పు సత్యాగ్రహం:--


దీర్ఘ కాల ఏకాంతాన్ని విడిచి గాధీ ప్రసిద్ధి చెందిన దండీయాత్రను ప్రారంభించారు, మార్చి 12 నుండీ 6 ఎప్రల్ 1930 మధ్యకాలంలో త అహ్మదాబాదు లోని తన ఆశ్రమము నుండీ గుజరాత్ తీరంలోని దండీ వరకూ గల 400 కిలో మీటర్ల దూరం కాలినడకన తన యాత్ర సాగించారు. ఈ యాత్ర దండీయాత్రగా లేదా ఉప్పు సత్యాగ్రహంగా పసిద్ధి గాంచింది. దండిలో బ్రిటీష్ వారు ఉప్పుపై విధించిన సుంకానికి వ్వతిరేకంగా గాధీగారు అతని అనుచరులు చట్టాన్ని వ్యతిరేకించి సముద్రపు నీటీ నుండీ ఉప్పును వండారు.

1930 ఎప్రల్ మాసంలో కలకత్తాలో రక్షక బటులకీ, ప్రజలకీ మద్య హింసాత్మకమైన కొట్లాటలు జరిగాయి. 1930-31 మధ్యకాలంలో సత్యాగ్రహం కారణంగా సుమారు లక్షమంది ప్రజలు కారాగారం పాలైనారు. పెష్వార్ లోని కిస్సా ఖవాని బజారు మారణకాండలో అనామక ప్రజలపై కాల్పులు జరిగాయి. ఈ సంఘటనతో అప్పుడే క్రొత్తగా పుట్టిన ఖుదై ఖిద్మత్గర్ ఉధ్యమ స్థాపకుడు ఖాన్ అబ్దుల్ ఘఫార్ ఖాన్ సరిహద్దు గాంధీగా దేశ తెరపైకి వచ్చాడు. 1930 లో గాధీ కారాగారంలో ఉండగా కాంగ్రెస్ కు పాతినిధ్యంలేని మెదటీ రౌవుండ్ టేబుల్ సమావేశం లండన్ లో జరిగింది. సత్యాగ్రహం కారణంగా ఎదురైన ఆర్ధిక విషమ పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ పై నిషేధం తొలగింపబడినది. గాధీ తో సహా కాంగ్రెస్ కార్యనిర్వాహణ సంఘం పతినిధులు జనవరి 1931 లో విడుదలైనారు.

1931 మార్చిలో గాంధీ-ఇర్విన్ ఒప్పందం కుదిరింది, పభుత్వం రాజకీయ ఖైదీలనందరినీ విడిచిపెట్టటానికి అంగీకరించింది అయితే కొందరు ముఖ్య తిరుగుబాటు దారులను విడిచిపెట్టకపోవటం,భగత్ సింగ్ మరియు అతని ఇరు సహచరులకు విధించిన మరణ శిక్షని వెనక్కి తీసుకోక పోవటంతో ఇంటా బైటా కాంగ్రెస్ మీద నిరసనలు ఏక్కువైనాయి.ప్రభుత్వ చర్యలకు బదులుగా సత్యాగ్రహాన్ని విరమించటానికి మరియు కాంగ్రెస్ ఏకైక పతినిధిగా రెండవ రౌవుండ్ టెబుల్ సమావేశంలో పాల్గొనటానికి గాధీ అంగీకరించారు. అయితే డీసెంబరు 1931లో జరిగిన ఈ సమావేశం విఫలమవ్వటంతో గాధీ బారతదేశానికి తిరిగి వచ్చి జనవరి 1932 లో సత్యాగ్రహాన్ని తిరిగి ప్రారంభించారు.

తరువాత కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ మరియు పభుత్వం 1935 భారత ప్రభుత్వ చట్టం పై అంగీకారం కుదిరేవరకూ ఘర్షణ-చర్చల పరంపరలో మునిగి తేలాయి అయితే అప్పటికే కాంగ్రెస్-ముస్లింలీగ్ మధ్య పుడ్చలేనంతగా అగాదం ఏర్పడి ఒకదానినినొకటి తీవ్రంగా వేలెత్తి చూపుకోసాగాయి. భారత ప్రజలందరికీ పాతినిధ్యం వహిస్తున్న సంస్థగా కాంగ్రెస్ చేస్తున్న వాదాన్ని ముస్లింలీగ్ ఖండిస్తే,భారత దేశంలోని ముస్లింలందరి వాణికి ఆకాంక్షలకీ ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్ధగా ముస్లింలీగ్ చేస్తున్న వాదాన్ని కాంగ్రెస్ త్రోసిపుచ్చింది.



ఎన్నికలు మరియు లాహోర్ తీర్మానము:---



జిన్నా మరియు గాంధీ, 1944.1935 వ సంవత్సరములో చేయబడిన భారత పభుత్వ చట్టం చివరిసారిగా బ్రిటీష్ ఇండియాని పాలించటానికి చేయబడిన మహా ప్రయత్నము అది ముఖ్యముగా మూడు లక్ష్యాలను నిర్ధేశించింది. ఆ లక్ష్యాలు

సరళమైన సమాఖ్య వ్వవస్థని స్థాపించటము
రాష్ట్రాల స్వయం పతిపత్తిని సాధించటము
అల్పసంఖ్యాక ప్రజల ఆకాంక్షలను రక్షించటానికి వీలుగా వేరువేరుగా నియోజకవర్గాలను ఏర్పరచటము
సంస్థానాలను భారత సమాఖ్య లో విలీనంచేయటానికి ఏర్పరిచిన నిబంధనలను అప్పటికే ఉన్న సంస్థానాధీశుల హక్కుల రక్షణ పై ఏర్పడిన సంధేహాల కారణంగా అమలు చేయలేదు. ఆయితె 1937 లో ఎన్నికలు నిర్వహించేనాటికి సంస్థానాధీశుల స్వయంప్రపత్తి వాస్తవరూపం సంతరించుకుంది. ఐదు రాష్ట్రాలలో స్పష్టమైన ఆధిక్యతను కలిగి మరి రెండు రాష్ట్రాలలో అతిపెద్దపక్షంగా అవతరించిన కాంగ్రెస్ నిర్ణయాత్మక శక్తిగా ఎదిగింది. అయితే ముస్లింలీగ్ నిరాశాజనకమైన ఫలితాలను మత్రమే సాధించింది.

1939 లో రాష్ట్ర పభుత్వాలను సంప్రధించకుండానే వైస్రాయి విక్టర్ అలెక్సాండర్ జాన్ హోపె భారతదేశం యుద్ధంలో ప్రవేశించిందని ప్రకటించారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ తన ఎన్నికైన ప్రతినిధులను ప్రభుత్వంనుండీ రాజీనామా చేయాల్సిందిగా కోరింది. ముస్లింలీగ్ అధ్యక్షుడు జిన్నా 1940లొ లాహోర్ లో జరిగిన వార్షిక సమావేశాలలో భారతదేశాన్ని రెండుగా విభజించమని కోరుతూ తీర్మానించవలిసిందిగా అందలి పాల్గొను పతినిధులను ఒప్పించాచు.ఇదే తరువాత కాలంలో లాహోర్ తీర్మానంగా వెలుగులోకి వచ్చింది.కొన్నిసార్లు దీనినే ధ్విజాతి సిద్ధాంతమని కూడా పేర్కొంటారు. పాకిస్తాన్ అనే భావాన్ని 1930 లోనే పరిచయంచేసినప్పటికీ చాలా తక్కువమంది మాత్రమే స్పందిచారు అయితే హిందూ ముస్లింల మధ్య ఉన్న సున్నితమైన రాజకీయ వాతావరణం ఘర్షణ భావాలు పాకిస్తాన్ అనే భావనను గట్టి కోరికగా మార్చాయి.



విప్లవ పోరాటాలు
భారత స్వాతంత్ర్య విప్లవ పోరాటాలు:--



చెదురుమదురుగా జరిగిన కొన్ని సంఘటనలను మినహాయిస్తే, బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ ఉధ్యమం 20వ శతాబ్ధ ప్రారంభం వరకూ సఘటితమవలేదు. మహారాష్ట్ర, బెంగాల్, ఒరిస్సా, బీహార్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ మరియు నేడు దక్షిణభారతంగా పిలవ బడుతున్న మద్రాస్ ప్రెసిడెన్సీ లలో అనేక విప్లవ సంస్థల ఆవిర్భావంతో 1900ల మెదటి దశకంలో భారత విప్లవ భావాలు వూపందుకున్నాయి. అయితే ఈ విప్లవ సంస్థలు అసంఘటితంగా ఉడటం జరిగింది. ముఖ్యంగా చెప్పుకోదగిన ఉధ్యమాలు 1905 లో జరిగిన బెంగాల్ విభజనకు వ్వతిరేకంగా బెంగాల్ లో మరియు పంజాబ్ లో ఉద్భవించాయి. 'చదువుకున్న నిబద్ధత కలిగిన మేధావులు బెంగాల్ లో గొప్ప భారత విప్లవాలకు కారణమైతే, గ్రామీణ సైనిక సమాజం పజాబ్ లో విప్లవాని గట్టి ఊతం ఇచ్చింది. జుగంతర్ మరియు అనుషీలన్ సమితి లాంటి సంస్థలు 1900 మెదట్లో పుట్టుకొచ్చాయి. వాటి విప్లవ సిద్ధాంతాలు మరియు ప్రయత్నాలు 1905లో వాటి ఉనికిని చూపెట్టాయి. అరబిందో ఘోష్ అతని తమ్ముడు బరీంద్ర ఘోష్, భూపేంద్ర దత్త మెదలయిన వారు 1906 ఎప్రల్ మాసం లో జుగంతర్ స్థాపనతో విప్లవవీరులని సంఘటితపరచటానికి మెదటి అడుగులు వేశారని చెప్పవచ్చు. అప్పటికే బెంగాల్ లో వ్యాయామ సంఘం ముసుగులో వున్న అనుషీలన సమితి అనే విప్లవ సమాజం అంతర్గత వర్గంగా జుగంతర్ ని స్థాపించారు. జుగంతర్, అనుషీలన సమితి బెంగాల్ మరియు భారత దేశంలోని అనేక ప్రాంతాలలో విస్తృతంగా శాఖలను ఏర్పరిచి అనేక మంది యువతీ యువకులను విప్లవంలో కార్యకలాపాలకై చేర్చుకొన్నాయి. అనేక హత్యలు, దోపిడీలు జరిపి అనేక మంది విప్లవకారులు బంధీలైనారు.జుగంతర్ పక్షానాయకులైన బరిన్ ఘోష్ మరియు బాఘా జెతిన్ పేలుడు పదార్ధాలను తయారీ ప్రారంభించినారు.అనేక ఎన్నదగిన తీవ్రవాద చర్యలలో భాగంగా జరిగిన విమాన పేల్చివేత మరియు ముఘాఫర్ పూర్ హత్యాకాండ విచారణలో అనేక మంది కార్యకర్తలు ఆజన్మ దేశ బహిష్కృతులవగా ఖుదిరామ్ బోస్ ఉరితీయబడినాడు. 1905 లండన్ లో శ్యామ్జీ కృష్ణ వర్మ నేతృత్వంలో స్థాపిపబడిన ఇండియా హౌస్ మరియు ది ఇండియన్ సోషలిష్ట్ సంస్థల వలన తీవ్రవాద కార్యకలాపాలు బ్రిటన్ లో కూడా వ్యాపించాయి. 1909 జులై 1 వతారీకున ఇండియన్ హౌస్ తో దగ్గరి సంబంధము కలిగిన మదన లాల్ ధిన్‌గ్రా అనే భారతీయ విధ్యార్ధి విలియమ్ హట్ కర్జన్ అనే బ్రిటీష్ పార్లమెంటు ప్రతినిధిని కాల్చిచంపాడు.1912 సంవత్సరంలో రష్ బిహారి బోస్ నేతృత్వంలో అప్పటి భారత వైస్రాయి చార్లెస్ హార్డిన్గె ని హతమార్చుటకు పన్నిన డిల్లీ-లాహోర్ కుట్ర వెలుగు చూసింది.1912 డిసెంబర్ 12వ తారీకున బ్రిటీష్ రాజ్య రాజదానిని కలకత్తా నుండీ డిల్లీకి మార్చుటకు వుద్దేశించిన కార్యక్రమంలో వైస్రాయి పరివారంపై విస్పోటక దాడికి జరిగిన విఫల యత్నంలో కుట్ర విచ్చిన్నం అయినది. ఈ సంఘటానానంతరం బ్రిటీష్ ఇండియా అంతర్గత రక్షణ శాక ప్రచ్చనంగా విస్తరించిన విప్లవ ఉద్యమాన్ని నాశనం చేయటానికి తీవ్రమైన పయత్నం చేసింది. ఈ కాలంలో బెంగాల్ పంజాబ్ లలో విప్లవ ఉద్యమం తీవ్ర వత్తిడికి లోనైనది.రష్ బిహారి బోస్ 3 సంవత్సరాల పాటు బ్రిటీవారికి దొరకకుండా తప్పించుకో గలిగినాడు అప్పటికి ఐరోపాలో రెండవ ప్రపంచ యుద్ధం పారంభమవ్వటంతో బెంగాల్ లో విప్లవ ఉద్యమం తిరిగి స్థానిక పాలనని స్తంభింపచేసేంత శక్తి పుంజుకో గలిగినది.



మెదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారత విప్లవకారులు భారత-జర్మన్ కుట్రలో భాగంగా జర్మనీనుండీ ఆయుధాలను మరియు మందుగుండును దిగుమతి చేసుకొని బ్రిటీష్ వారికి వ్వతిరేకంగా సాయుధ విప్లవానికి వ్యూహం పన్నినారు. విదేశాలనుండీ కార్వకలాపాలు సాగిస్తూ ఘదార్ పక్షం విప్లవకారులకు సహకరించింది. భారతవిప్లవకారులు విదేశీ ఆయుధాలను సమకూర్చుకొనుటకు సాధనమైనది. మెదటిప్రపంచ యుద్ధానంతరం ముఖ్యనేతలు బందీలుకావటంతో క్రమంగా విప్లవ కార్యకలాపాలు క్షీణింపసాగాయి. 1920 సంవత్సరంలో కొందరు విప్లవకారులు పునర్వవస్థీకృతమవటం ప్రారంభించారు. చంద్రశేఖర్ అజాద్ నేతృత్వంలో హిందూస్తాన్ సోషలిష్ట్ రిపబ్లికన్ అసోసియేషన్(భారత సామ్యవాద స్వాతంత్ర్య సంఘం)స్థాపించబడినది. 1929 సంవత్సరము ఎప్రల్ 8వ తారీకున ప్రజారక్షణ మరియు వ్యాపార వివాదల చట్టాల ఆమోదానికి నిరసనగా భగత్ సింగ్ మరియు బతుకేస్వర్ దత్ కేద్రీయ విధాన సభలోకి బాంబులు విసిరారు. 1931లో కేద్రీయ విధాన సభ పెల్చివేత నేర విచారణానంతరం భగత్ సింగ్, సుఖ్ దేవ్ మరియు రాజ్ గురు ఉరితీయ బడ్డారు. ముస్లింలను భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భాగం చేయటానికి అల్లమ మష్రిక్వి (Allama Mashriqi) ఖక్‌సర్ తెహ్రీక్ అనే సంస్థను స్థాపించాడు. [16]

1930 ఎప్రల్ 18వ తారీకున సూర్య సేన్ ఇతర విప్లవకారులతో కలిసి మందుగుండు మరియు ఆయుధాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ సమాచార వ్వవస్థను విచ్ఛిన్నం చేసి ప్రాంతీయ ప్రభుత్వాన్ని ఏర్పరుచుటకై చిట్టగాంగ్ లోని ఆయుధాగారాన్ని ముట్టడించారు. 1932 లో ప్రీతీలతా వడ్డెదార్ యూరపియన్ క్లబ మీద జరిగిన దాడికి నాయకత్వం వహించారు. బీనా దాస్ కలకత్తా విశ్వవిధ్యాలయం కాన్వోకేషన్ సభప్రాంగణంలో బెంగాల్ గవర్నర్ స్టాన్లి జాక్సన్ ని హతమార్చేందుకు విఫలయత్న చేశాడు.చిట్టగాంగ్ అయుధాగార ముట్టడి అనంతరం సూర్య సేన్ ఉరితీయ బడగా అనేకమంది ఆజన్మాత ప్రవాస శిక్షకై అండమాన్ ధ్వీపంలోని సిల్యులర్ జైలుకు తరలింపబడ్డారు. 1928 లో బెంగాల్ వాలంటీర్స్ తన కార్యకలాపాలు ప్రారంభించినది. ఈ పక్షంలోని బినోయ్ బసు-బాదల్ గుప్తా-దినేష్ గుప్తా అనే త్రయం కలకత్తా లోని సెక్రటేరియేట్ (విధాన సౌధము) లోని రచియతల (వ్రైటర్స్) భవనంలోకి ప్రవేశించి ఇన్సెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ కల్నల్ ఎన్.ఎస్.సింప్సన్ ని హత్యచేసింది.

1940 మార్చి 13వ తారీకున , ఉధమ్ సింగ్ అమృత్సర్ మారణ కాండకు బాద్యుడిగా పరిగణింపబడిన మైకేల్ ఓ డైయర్ ని లండన్ లో కాల్చి చంపాడు. అయితే 1930 దశకం చివరి సంవత్సరాలలో ప్రధాన స్రవంతిలోని నాయకులు బ్రిటీష్ వారు ప్రతిపాదించిన అనేక మార్గాలను పరిగణించటంతో మరియు మతరాజకీయాలు తెరపైకి రావటంతో రాజకీయ పరిస్థితులలో మార్పు వచ్చి విప్లవ కార్యకలాపాలు క్రమంగా తగ్గుముకం పట్టాయి. అనేక మాజీ విప్లవకారులు ప్రధాన రాజకీయ స్రవంతిలోకి ప్రవేసించి భారత జాతీయ కాంగ్రెస్ మరియు అనేక ఇతర ముఖ్యంగా కమ్యునిష్ట్ పక్షాలలోకి ప్రవేశించగా మిగిలిన అనేక మంది దేశంలోని వివిధ జైళ్ళలో బంధీలైనారు.



అంతిమ ఘట్టం: యుద్ధం, క్విట్ ఇండియా, ఐ.ఎన్.ఎ మరియు యుద్ధానంతర తిరుగుబాట్లు:--


భారతదేశం మెత్తంమీద భారతీయులు రెండవ ప్రపంచయుద్ధంలో విభజింప బడ్డారు. ఎన్నికైన భారత ప్రతినిధులను సంప్రధించకుండా ఏక పక్షంగా బ్రిటీష్ వైస్రాయి భారతదేశం మిత్ర రాజ్యాల తరుపున యుద్ధాలోకి దుమికిందని ప్రకటించటంతో నిరసనగా మెత్తం కాంగ్రెస్ నాయకత్వం స్థానిక ప్రభుత్వ సంస్థలనుండీ వైదొలిగింది. అయితే బ్రిటీష్ వారికి యుద్ధంలో సహాయ పడాలని చాలామంది భావించారు. 205,000 మంది పరివారంతో యుద్ధంలో పాల్గొన్న పెద్ద సైన్యాలలో ఒకటైన భారత బ్రిటీష్ సైన్యం ఇందుకు నిదర్శనం. బ్రిటన్ కొరకు జరిగిన పోరు సమయంలో గాంధీ సహాయ పెద్ద యెత్తున సహాయ నిరాకరణానికి పిలుపునివ్వాలని ఇంటా బైటా వచ్చిన వత్తిడులను తాను బ్రిటన్ శిధిలాలనుండీ భారత స్వాతంత్ర్యయాన్ని కాంక్షించటంలేదంటూ వ్యతిరేకించారు. అయితే యుద్ధంలో మారిన జాతకాలకు అనుగుణంగా వచ్చిన రెండు ఉద్యమాలు వంద సంవత్సరాల భారత స్వతంత్ర్య ఉద్యమాన్ని పతాక ఘట్టానికి తీసుకు వెళ్ళాయి.

దీనిలో మెదటిది నేతాజీ సుభాస్ చంద్ర బోస్ నేతృత్వంలో అజాద్ హింద్ ఉద్యమము ప్రపంచ యుద్ధ మెదటి అంకంలో ప్రారంభమై అంక్షరాజ్యాల సహకారాన్ని అర్ధించింది. రెండవది 1942లో యుద్ధానంతరం అధికార బదిలీకి భారత నాయకత్వంతో ఏకాభిప్రాయానికి రావటానికి జరిగిన క్రిప్స్ రాయబారం విఫలమవటంతో ప్రారంభమైనది




భారత జాతీయ సైన్యం:--
భారత జాతీయ సైన్యం & నేతాజీ సుభాస్ చంద్ర బోస్


.ఏకపక్షంగా జరిగిన భారత యుద్ధ ప్రవేశాన్ని 1937 మరియు 1939 లలో రెండు సార్లు కాంగ్రెస్ అద్యక్షునిగా ఎన్నికైన సుభాస్ చంద్ర బోస్ తీవ్రంగా వ్వతిరేకించాడు. యుద్ధంలో పాల్గొనటానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ మద్దత్తుకు గట్టి ప్రయత్నం చేసి కాంగ్రెస్ నుండీ బయటకి వచ్చి ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే నూతన పక్షాన్ని స్థాపించారు.యుద్ధం విరుచుకు పడటంతో బ్రిటీష్ ప్రభుత్వం అతనిని 1940లో కలకత్తా లో గృహ నిర్భందం చేసింది. ఐరోపా మరియు ఆసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చిన సమయంలో సుభాస్ చంద్ర బోస్ తప్పించుకుని భారత జాతీయ సైన్యాన్ని సమీకరించి బ్రిటీష్ సృంఖలాల పై పోరాడటానికి అంక్ష రాజ్యాల సహకారాన్ని కోరుటకు అఫఘనిస్తాన్ మీదగా జర్మనీ చేరుకున్నారు.అచ్చట రొమ్మెల్ యొక్క పట్టుబడిన భారత బ్రిటీష్ సిపాయిలతో స్వతంత్ర్య పటాలాన్నిసమకూర్చుకున్నాడు. ఇదే ఫ్రీ ఇండియన్ లీజున్ గా పేరొందినది. భారత విముక్తి సైన్యాన్ని స్థాపించి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడాలని మొలకెత్తుతున్న బోస్ కలలనుండీ ఈ స్వతంత్ర్య పటాలం ఉద్భవించింది. అయితే ఐరోపాలో మారుతున్న యుద్ధ పరిణామాల కారణంగా బోస్ జపాన్ చేరి జపాన్ ఆక్రమిత ఈశాన్య ఆసియా నుండీ ప్రవాస స్వతంత్ర్య భారత ప్రభుత్వాన్ని ప్రతిష్టించి జపాన్ వారి సహకారంతో భారత జాతీయ సైన్యాన్ని స్థాపించారు. పోరాట శక్తిగా భారతదేశం చేరి ప్రజలలో తీవ్ర బ్రిటీష్ వారిపై వ్యతిరేకతను పెంచి భారత సైనికులను తిరుగుబాటుకు ప్రేరేపించి బ్రిటీష్ పాలనను అంతమొందించటం దాని ముఖ్య ఉద్దేశం.

ఐ.ఎన్.ఎ అప్పటికి భారత బ్రిటీష్ సైన్యం తో కలసిన మిత్రరాజ్యాల మిత్రరాజ్యాల బలగాలతో జపాన్ వారి 15వ దళంతో కలిసి బర్మా మరియు అస్సాం అడవులలో పోరాటం చేసి ఇంఫాల్ మరియు కోహిమా లను చేజిక్కించుకో వలిసి ఉన్నది.యుద్ధంలో జపాన్ అండమాన్ నికోబార్ దీవులను ఆక్రమించి ఐ.ఎన్.ఎ కి అప్పగించటం జరిగినది.సుభాస్ చంద్ర బోస్ వాటికి షాహిద్ మరియు స్వరాజ్ అని నామకరణం చేసారు.

అయితే ఐ.ఎన్.ఎ కి జపాన్ వారినుండీ సరియైన ఆయుధ సరఫరా మరియు శిక్షణ లేనికారణంగా అపజయాల బాట పట్టింది.అంతు చిక్కని రీతిలో సుభాస్ చంద్ర బోస్ మరణించటంతో ఆజాద్-హిద్ ఉద్యమం అంత్యదశకు చేరింది. యుద్ధంలో జపాన్ లొంగు బాటుతో భారత జాతీయ సైన్యానికి చెందిన సిపాయిలను భారత దేశానికి తీసుకురావటంతో పాటు వారిలో అనేకురి పై రాజద్రోహం ఆరోపింపబడినది. అయితె ఈ అప్పటకి బోస్ సాహస కృత్యాలు మరియు క్రియాశీల కార్యకలాపాలు ప్రజల దృష్టిలో ఆదరణ పొందటంతో దేశీయ సిపాయల విశ్వాసం బ్రిటీష రాణి పట్లనుండీ దూరమై భారత జాతీయ సైన్యానికి సహకరించిన వారిగా బ్రిటీష్ వారిచే బావించబడినవారిపైకి మరలింది.భారత జాతీయ సైనికుల పై విచారణ జరపటం ద్వారా బ్రిటీష్ భారత సైన్యంలో ఆత్మ విస్వాసాన్ని పెంపొందిచవచ్చన్న బ్రిటీష్ ప్రభుత్వ భావన ఆచరణలో ఆశాంతిని రేకెత్తించి సైనికులలో బ్రిటీష్ వారికి సహకరించామనే అపరాధ భావనను రేకెత్తించింది. బోస్ మరియు భారత జాతీయ సైన్యం న్యాయం కోరకు పోరాడిన వీరులుగా యావత్తు భారత దేశం భావించటంతో బ్రిటీష్ భారత సైన్యం అన్యాయం వైపు పోరాడీన పక్షంగా పరిగణింప బడినది. ఈ పరిణామాలతో బ్రిటీష్ పభుత్వ అస్థిత్వానికి వెన్నెముకైన భారత బ్రిటీష్ సైన్యం ఇంకెత మాత్రము విస్వసింపదగినది కాదని పభుత్వానికి తేటతెల్లం మయ్యింది. చివరకి ఈ పరిణామాలు ఎలా పరిణమించాయంటే సుభాస్ చంద్ర బోస్ ఆత్మ బ్రిటీష్ వారిని ఎర్రకోట బురుజులవరకూ వెంటాడిందని చెప్పటం ఆతిశయోక్తి కాజాలదు. అప్పటి కప్పుడు ఆకాశానికి ఎత్తబడిన సుభాస్ చంద్ర బోస్ వ్వక్తిత్వం బ్రిటీష్ వారిని ఆలోచనా విదానంలో గణనీయమైన మార్పుతీసుకు వచ్చి చర్చలద్వారా స్వతంత్ర్యానికి బాటలు పరిచింది.యుద్ధం తరువాత భారత జాతీయ సైనికుల పై జరిగిన విచారణలో అజాద్ హింద్ ఉద్యమం మరియు భారత జాతీయ సైన్యం గురించిన కదలు ప్రజలొకి వచ్చాయి. అవి ఎంత భావోద్వేగాన్ని కలిగించాయంటే 1945లో భారత దేశంలోనే కాక ఇతర వలస రాజ్యాలలో తిరుగుబాటుకు బైయపడి ప్రభుత్వం వాటి ప్రసారాన్ననిలిపివేయ వలసిందిగా బి.బి.సి ని కోరింది. వార్తా పత్రికలు భారత జాతీయ సైనికులకు మరణ దండన విదించటాన్ని ప్రజలకు తెలియచెప్పాయి. తత్ఫలితంగా తరువాత కాలంలో అనేక తిరుగుబాట్లు తలెత్తాయి. కోదరు చరిత్ర కారులు భారత జాతీయ సైన్యం, అజాద్ హింద్ ఉద్యమం చే ప్రేరణ పోదబడిన బ్రిటీష్ భారత సైన్యం భారత దేశానికి స్వతంత్ర్యం తెచ్చిపెట్టాయని భావిస్తారు.



క్విట్ ఇండియా:--



భారతీయులను రెండవ ప్రపంచ యుద్ధంలోకి పంపిచటానికి నిరసనగా భారతదేశ స్వాతంత్ర్యానికి గాంధీ ఇచ్చిన పిలుపు నందుకుని 1942 ఆగష్ట్ లో క్విట్ ఇండియా ఉద్యమము ప్రారంభమైనది.యుద్ధం ప్రారంభమైన తరువాత 1939 సెక్టెంబరు మాసంలో వార్ధా లో జరిగిన కాంగ్రెస్ పక్ష కార్యనిర్వహణ సంఘ సమావేశాలలో ఫాసిజానికి వ్యతిరేకంగా షరతులతో కూడిన మద్ధతునిస్తూ కాంగ్రెస్ తీర్మానించింది.అందుకు ప్రతిఫలంగా కోరిన యుద్ధానంతర భారత స్వాతంత్ర్యయాన్ని బ్రిటీష్ వారు త్రిరస్కరించటం జరిగినది.

1942 లో ఐరోపా మరియు ఆగ్నేయ ఆసియాలో ప్రతికూలించిన యుద్ధ పరిస్ధితులలో భారత ఉపకండం అన్యమస్కంగా యుద్ధంలో పాల్గొనటం, బ్రిటీష్ భారత సైన్యంలో మరియు భారతీయులలో పెరిగిన అసంతృప్తి బ్రిటీష్ వారిని భారతదేశాన్ని బుజ్జగించేదుకు ప్రేరేపించాయి. యుద్ధానంతరం భారతీయులకు అధికార బదలాయింపుకు ప్రతిఫలంగా యుద్ధంలో భారతీయుల సంపూర్ణ మద్దత్తు కూడగట్టటానికి బ్రిటీష్ వారు క్రిప్స్ ఆధ్వర్యంలో రాయబార బృందాన్ని భారతదేశానికి పంపించటం జరిగినది. అయితే స్వపరిపాలనకు నిర్ధిష్ట సమయాన్ని సూచించలేకపోవటం, ఆధికార బదలాయింపుకు సరైన నిర్వచనాన్ని ఇవ్వలేక పోవటం తో పరిమితమైన పాలనాధికారాన్ని మాత్రమే ఇవ్వజూపిన క్రిప్స్ రాయబారం భారత ఉధ్యమకారులకు ఆమోదయోగ్యంకాలేదు.దీనితో చర్చ విఫలమైనాయి.కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది. ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం బ్రిటీషు ప్రభుత్వాన్ని రెండవ ప్రపంచ యుద్ధంలో చేసిన సహాయాన్ని అడ్డంపెట్టుకుని బేరసారాలకి దించడమే.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1942 ఆగష్టు 8న క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానంలో కాంగ్రెస్ బ్రిటీష్ ప్రభుత్వం భారత ప్రజల కోరికలను ఆమోదించనట్లయితే దేశవ్యాప్త సత్యాగ్రహానికి పిలుపునిచ్చింది. బొంబాయి లోని గొవలియ టాంక్ మైదానంలో(తరువాత క్రాంతి మైదానంగా మార్చబడినది)ఆగష్ట్ 8న సత్యాగ్రహంతో చావో-బ్రతుకో తేల్చుకోవాల్సిందిగా గాంధీ గారు ఇచ్చిన పిలుపు ఉద్యమంమీద ఆయన నమ్మకానికి మచ్చుతునక. ఆ ఉపన్యాసంలో ప్రజలను స్వతంత్ర భారత పౌరులుగా జీవించాలని, బ్రిటీష్ ప్రభుత్వ ఆజ్ఞలను ధిక్కరించాలని పిలుపునిచ్చారు. అప్పటికే భారత-బర్మా సరిహద్దులలో జాపాన్ సైన్య పురోగతితో అప్రమత్తమైన ప్రభుత్వం గాధీని అఘాకాన్ పాలెస్లో, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని మరియు జాతీయ నాయకత్వాన్ని అహ్మద్ నగర్ కోటలో బందించింద. కాంగ్రెస్ ని నిషేదించటంతో పాటు గాంధీ గారి ఉపన్యాసం తరువాత 24 గంటల లోపే దాదాపు అందరు కాంగ్రెస్ నాయకులను ప్రభుత్వం నిర్బందించింది, వీరందరూ యుద్దం సమయంలో జైలు జీవితం గడిపారు. దేశ వ్యాప్తంగా పెద్దయెత్తున ప్రదర్శనలు అందోళనలు జరిగాయి. కార్మికులు పెద్దయెత్తున సమ్మె చేసారు. ఉద్యమంలో పెద్దయెత్తున హింస చోటుచేసుకుంది. భారత విప్లవ సంఘాలు మిత్రరాజ్య సరఫరా వ్యవస్థలమీద బాంబు దాడులు చేశారు, పభుత్వ ఆస్తులకు నిప్పు పెట్టారు. కాంగ్రెస్ ముస్లింలీగ్ వంటి ఇతర రాజకీయ శక్తుల మద్దత్తు పోందలేక పోయినప్పటికీ పెద్దయెత్తున ముస్లింల మద్దత్తు సంపాదించింది. బ్రిటష ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి దేశ వ్యాప్తంగా లక్షమందికి పైగా జైళ్ళకు పంపింది. ప్రజాందోళన మీద లాఠీ దాడి చేయటంమే కాక అపరాధ రుసుమును విధించింది. త్వరలోనే ఉద్యమం నాయకత్వంలేని ఆందోళనగా మారి అనేక ప్రాంతీయ విప్లవ సంఘాల చేతులలోకి మళ్ళంది.గంధీ గారి అహింసాయుత సిద్దాంతాలకు వ్యతిరేకంగా అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే 1943 వ సంవత్సరానికి క్విట్-ఇండియా ఉధ్యమం నీరసించింది




రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు(RIN Mutiny):--


18 ఫిబ్రవరి 1946లో ముంబాయిలో ఓడలలోను, రేవులలోను "రాయల్ ఇండియన్ నేవీ" లో పనిచేసే భారతీయ నావికుల సమ్మె, తదనంతర తిరుగుబాటు, రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు(RIN Mutiny)గా పిలువబడ్డాయి. ముంబయి రేవులో మొదలైన తిరుగుబాటు కరాచీ నుండి కలకత్తా వరకు వ్యాపించింది. ఇందులో 78 ఓడలు, 20 రేవులు, 20వేల నావికులు పాలు పంచుకున్నారు.

నావికాదళంలోని సాధారణ పరిస్థితులు, భోజన సదుపాయాల కారణంగా మొదలైన ఈ సమ్మెకు, బ్రిటిషు అధికారుల జాతి వివక్ష, జాతీయ వాద సమర్ధకులపై క్రమశిక్షణా చర్యలు అంతర్వాహినులుగా ఉన్నాయి. 18న మొదలైన ఈ సమ్మెకు, 19 సాయంత్రానికల్లా "కేంద్ర నావికా సమ్మె కమిటీ" ఎన్నికయింది. సిగ్నల్ మాన్ లలో ముఖ్యుడైన ఎం. ఎస్. ఖాన్ అధ్యక్షుడిగాను, పెట్టీ ఆఫీసర్ టెలిగ్రాఫిస్టు మదన్ సింగ్ ఉపాధ్యక్షుడిగాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. [17]. భారత జాతీయ సైన్యపు కధనాలతో ఉత్తేజితులైన భారతీయులు ఈ సమ్మెకు భారీ మద్దతునిచ్చారు. పలు ప్రదర్శనల ద్వారా ఈ తిరుగుబాటుకు మద్దతు లభించింది. వీటిలో బోల్షివిక్-లెనినిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిలోన్ అండ్ బర్మా వారి పిలుపుతో జరిగిన ఒక రోజు ముంబయ్ సార్వత్రిక సమ్మె కూడా ఒకటి. ఈ సమ్మె ఇతర నగరాలకు వ్యాపించింది. వాయుసేన, ఆయా నగరాల ప్రాంతీయ పోలీసులు కూడా సమ్మెలొ దిగారు. నావికాదళ సభ్యులు తమను తాము "భారత జాతీయ నావికాదళం"గా ప్రకటించుకొని, బ్రితిషు అధికారులకు ఎడమచేతి అభివాదాలు (సెల్యూట్) చేయనారంభించారు. కొన్ని చోట్ల, భారత బ్రిటిషు సైన్యంలోని, నాన్ కమిషన్డ్ అధికార్లు (NCOs) బ్రిటిషు ఉన్నతాధికార్ల ఉత్తర్వులను బేఖాతరు చేసి ఉల్లంఘించారు. చెన్నై, పూనెలలోని బ్రిటిష్ సైనిక శిబిరాలలో సైతం తిరుగుబాటు గాలులు వీచాయి. కరాచి మొదలుకొని కలకత్తా వరకు భారీ విధ్వంసకాండ జరిగింది. ఓడలపై మూడు జండాలు (కాంగ్రెసు, ముస్లిం లీగు, కమ్యునిస్టు పార్టి ఆఫ్ ఇండియా ల), తిరుగుబాటుదారుల సామరస్యానికి ప్రతీకగా ఎగురవేయబడటం ప్రఖ్యాతిగాంచింది..




ఉద్యమాల ప్రాధాన్యత:--


స్వతంత్ర్య పోరాటంలో భాగాలైన వివిధ ఉద్యమాలు, సంఘటనల ప్రాధాన్యం, వాటి విజయాలు, వైఫల్యాలు చరిత్రకారుల చర్చలో భాగం. కొందరు చరిత్ర కారులు క్విట్-ఇండియా ఉద్యమాన్ని వైఫల్యంగా భావిస్తారు. వీరు అప్పటి బ్రిటిష్ ప్రధాని భారతదేశాన్ని వదిలి వెళ్ళటానికి భారతీయ సైన్యంలో ప్రబలిన అసంతృప్తిని ముఖ్యకారణంగా పేర్కొంటూ క్విట్-ఇండియాని బలహీనమైన కారణంగా వర్ణించారు. [18] [19] అయితే కొందరు భారత చరిత్రకారులు "క్విట్-ఇండియా" నే విజయం సాధించిందని భావిస్తారు. యుధ్దానంతరం సన్నగిల్లిన బ్రిటిషు సామ్రాజ్య ఆర్ధిక, సైనిక, రాజకీయ వనరులతో పాటు, క్విట్-ఇండియా ద్వారా వ్యక్తమైన భారత ప్రజల బలమైన వ్యతిరేకత బ్రిటీష్ ప్రభుత్వ స్థైర్యాన్ని దెబ్బతీసిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. అయితే వారు 1947లో జరిగిన అధికార బదలాయింపుకు విప్లవ పోరాటాల పాత్రను విస్మరిస్తారు. ఏది ఏమైనప్పటికీ[20][21] కోట్లాది ప్రజలు, చరిత్రలో అపూర్వమైన విధంగా, ఒక త్రాటిపై నిలచి, ఏకకంఠంతో స్వాతంత్ర్యమే వారి ఏకైక లక్ష్యమని ప్రకటించడమే స్వాతంత్ర్యసాధనకు ముఖ్యకారణమని విస్మరించరాదు. ప్రతి తిరుగుబాటు, ఎదిరింపు చర్యలు ఆ అగ్నికి ఆజ్యం పోశాయి. దీనికి తోడుగా అప్పుడే యుధ్ధపరిణామాల నుండి తేరుకుంటున్న తమ సామ్రాజ్యంలో, అణచివేతకు బ్రిటిషు ప్రజల, సైన్యాల మద్దతు లేకపోవటం కూడా ఒక కారణం.



స్వాతంత్ర్యము, 1947 - 1950 మధ్య పరిణామాలు:--


చివరి బ్రిటీష్ గవర్నర్ జనరలైన విస్కౌట్ లుయీస్ మౌంట్బాటెన్ 1947 జూన్ 3 న బ్రిటీష్ ఇండియాని లౌకిక భారత దేశంగాను మరియు ఇస్లామిక్ పాకిస్తాన్ గాను విభజిస్తున్నట్లు ప్రకటించారు. 1947 ఆగష్టు 14న పాకిస్తాన్, 1947 ఆగష్ట్ 15 న భారత దేశం స్వతంత్ర్య దేశాలుగా అవతరించాయి. స్వాతంత్ర్యానంతరం హిందూ ముస్లిం ల మధ్య తీవ్ర మతఘర్షణలు తలెత్తాయి. అప్పటి భారత ప్రధాని నెహ్రూ మరియు ఉపప్రధాని వల్లభాయ్ పటేల మౌంట్బాటెన్ ని గవర్నర్ జనరల్ గా కొనసాగవలసిందిగా కోరారు. 1948 లో అయన స్థానంలో చక్రవర్తి రాజగోపాలాచారి గవర్నర్ జనరల్ గా నియమితులైనారు. 565 సంస్థానాలని భారతదేశంలో విలీనం చేసే భాధ్యతను పటేల్ స్వీకరించారు. ఆయన తన ఉక్కు సంకల్పం నిజాయితీలతో కూడిన విధానాలతో ఏకీకరణ సాధించారు. బలప్రయోగంతో జూనాఘడ్, జమ్మూ-కాశ్మీర్ మరియు హైదరాబాద్ ఆపరేషన్ పోలో సంస్థానాల విలీనాలు ఆయన ఉక్కు సంకల్పానికి మచ్చుతునకలు.

1949 నవంబర్ 26 లో రజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనను పూర్తిచేసింది. 1950 జనవరి 26 వ భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించింది.రాజ్యాంగ పరిషత్ డా| రాజేధ్ర ప్రసాద్ ని ప్రదమ రాష్ట్రపతికా ఎన్నుకోవటంతో ఆయన రాజగోపాలా చారినుండీ బధ్యతలు స్వీకరించారు. స్వతంత్ర్య సర్వసత్తాక భారతదేశంలో గోవా 1961, పాండిచ్చేరి 1953-54 మరియు సిక్కింలు 1975 లో విలీనమయ్యాయి. 1952 లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో 62 శాతం పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

15, ఆగస్టు 2010, ఆదివారం

భారత ఎన్నికల కమిషను

స్వతంత్ర భారత దేశంలో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగం ఏర్పాటు చేసిన సంస్థ, భారత ఎన్నికల కమిషను. 1950 జనవరి 25 న ఏర్పాటు చేయబడిన ఈ కమిషను సుప్రీం కోర్టు వలెనే, రాజ్యాంగం ఏర్పరచిన స్వతంత్ర వ్యవస్థ, ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఉండదు.

కమిషను వ్యవస్థ:--


దేశంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసన సభలు, శాసన మండళ్ళకు జరిగే ఎన్నికలను కమిషను నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల నిర్వహణలో పర్యవేక్షణ, మార్గ నిర్దేశకత్వం, నియంత్రణ చేయవలసిన బాధ్యతను రాజ్యాంగం కమిషనుపై ఉంచింది.

ఎన్నికల కమిషను అధినేతను ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటారు. మొదట్లో ఒక కమిషనరు ఉండేవారు. 1989 అక్టోబర్ 16 న మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించారు. అయితే అది కేవలం 1990 జనవరి 1 వరకు మాత్రమే కొనసాగింది. మళ్ళీ 1993 అక్టోబర్ 1న ఈ నియామకాలు జరిగాయి. అప్పటి నుండి ముగ్గురు సభ్యుల కమిషను బాధ్యతలు నిర్వహిస్తూ వస్తూంది.

ముగ్గురు కమిషనర్లతో పాటు ఢిల్లీలో ఉన్న కమిషను కార్యాలయంలో కొంత మంది డిప్యూటీ కమిషనర్లు, 300 మంది ఇతర అధికారులు, సిబ్బంది ఉంటారు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ [1]రాష్ట్రాల్లో, ప్రధాన ఎన్నికల కమిషనరుచే నియమించబడే ముఖ్య ఎన్నికల అధికారి, కొందరు సహాయక సిబ్బంది ఉంటారు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం, ఎన్నికల నిర్వహణలో పాల్గొనే 50 లక్షల పైచిలుకు సిబ్బంది యావత్తూ తాత్కాలికంగా ఎన్నికలు ముగిసేవరకు కమిషను అదుపాజ్ఞలలో పనిచేస్తారు.

ప్రధాన ఎన్నికల కమిషనరును, ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. పదవీకాలం ఐదేళ్ళు, లేదా ఆ వ్యక్తికి 65 ఏళ్ళ వయసు వచ్చే వరకు -ఏది ముందయితే అది.



కార్య కలాపాలు:--


రాజ్యాంగ సంస్థ అయిన కమిషను ఎన్నికలకు సంబంధించినంత వరకు సర్వ స్వతంత్ర సంస్థ. దీని ముఖ్య కార్యకలాపాలు ఇలా ఉన్నాయి.

రాజకీయ పార్టీలకు గుర్తింపును ఇవ్వడం, రద్దు చేయడం.
ఎన్నికల ప్రణాళికను నిర్ణయించడం, ప్రకటించడం, అమలు చేయడం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయడం, అతిక్రమించిన వారిపై చర్యలు చేపట్టడం.
స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించడం
ఇటీవలి కాలంలో ఎన్నికల నిర్వహణను సంస్కరిస్తూ కమిషను కొన్ని చర్యలు చేపట్టింది. వీటిలో కొన్ని:

ఎలెక్ట్రానిక్ ఓటింగు మిషన్లను ప్రవేశపెట్టడం
రాజకీయాల్లో నేరస్థులను అడ్డుకోవడం
ఓటరు గుర్తింపు పత్రాలను ప్రవేశపెట్టడం
ఓటరు జాబితాల ఎలెక్ట్రానికీకరణ

పదునెక్కిన కమిషను:--


పూర్వపు రోజుల్లో కమిషను కార్యనిర్వాహ వ్యవస్థకు అనుకూలంగా ఉంటూ ఉండేది. ఇటీవలి కాలంలో- ముఖ్యంగా 1990 నుండి - కమిషను మరింత చైతన్యవంతంగా, ప్రభావవంతంగా వ్యవహరిస్తూంది. ఇప్పటికే ఉన్న నియమాలను కఠినంగా అమలు చెయ్యడంతో పాటు, కొన్ని కొత్త నియమాలను కూడా ప్రవేశపెట్టింది. కొన్ని సందర్భాలలో రాజకీయ పార్టీలతో కొందరు కమిషనర్లకు ఘర్షణ నెలకొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా, మొత్తం మీద కమిషను పనితీరు మాత్రం ఎంతో మెరుగుపడింది


ప్రధాన ఎన్నికల కమిషనర్లు:--


పేరు పదవీకాలం
సుకుమార్ సేన్ మార్చి 21 1950 నుండి డిసెంబర్ 19 1958
కె.వి.కె.సుందరం డిసెంబర్ 20 1958 నుండి సెప్టెంబర్ 30 1967
ఎస్.పి.సేన్‌వర్మ అక్టోబర్ 1 1967 నుండి సెప్టెంబర్ 30 1972
డా.నాగేంద్ర సింగ్ అక్టోబర్ 1 1972 నుండి ఫిబ్రవరి 6 1973
టి.స్వామినాథన్ ఫిబ్రవరి 7 1973 నుండి జూన్ 17 1977
ఎస్.ఎల్.షక్దర్ జూన్ 18 1977 నుండి జూన్ 17 1982
ఆర్.కె.త్రివేది జూన్ 18 1982 నుండి డిసెంబర్ 31 1985
ఆర్.వి.ఎస్.పేరిశాస్త్రి జనవరి 1 1986 నుండి నవంబర్ 25 1990
వి.ఎస్.రమాదేవి నవంబర్ 26 1990 నుండి డిసెంబర్ 11 1990
టి.ఎన్.శేషన్ డిసెంబర్ 12 1990 నుండి డిసెంబర్ 11 1996
ఎం.ఎస్.గిల్ డిసెంబర్ 12 1996 నుండి జూన్ 13 2001
జె.ఎం.లింగ్డో జూన్ 14 2001 నుండి ఫిబ్రవరి 7 2004
టి.ఎస్.కృష్ణ మూర్తి ఫిబ్రవరి 8 2004 నుండి మే 15 2005
బి.బి.టాండన్ మే 16 2005 నుండి

భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ

ప్రజాస్వామ్య దేశాలలో ఓటర్లచే ప్రజాప్రతినిధులను ఎన్నుకొను ప్రక్రియనే ఎన్నికల వ్యవస్థగా పిలువబడుతుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో స్వాతంత్ర్యం నుంచే ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య విలువలకు గట్టిగా పునాదులు వేసుకుంది.

2004 లో జరిగిన ఎన్నికలలో దాదాపు 67 కోట్ల మంది ఓటర్లు వున్నారు. ఈ సంఖ్య ఐరోపా సమాఖ్యలోగల దేశాల మొత్తం ఓటర్ల సంఖ్య కన్నా రెట్టింపు సంఖ్య. 1989 ఎన్నికల నిర్వహణ కొరకైన ఖర్చు 300 మిలియన్ డాలర్లు, మరియు పది లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ఉపయోగం జరిగినది.[1]. ఓటర్లు మరియు నియోజకవర్గాల సంఖ్య అధికంగా వున్న కారణంగా, ఎన్నికలు అనేక విడతలుగా జరుపుకునే అవసరం వున్నది. 2004 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు 4 విడతలుగా జరుగగా, 2009 ఎన్నికలు 5 విడతలుగా నిర్వహించినారు. ఈ ఎన్నికలు నిర్వహించుటకు భారత ఎన్నికల కమీషను వున్నది. ఈ కమీషను రాజకీయ పార్టీలకొరకు "ఎన్నికల నియమాళిని రూపొందిస్తుంది మరియు ఎన్నికల ఫలితాలను ప్రకటించి కేంద్ర లేక రాష్ట్ర శాసనాధికారికి జాబితా సమర్పిస్తుంది. ఈ విధానం ద్వారా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయుటకు మార్గం సుగమం అవుతుంది.



భారత్ లో ఎన్నికల విధానము
భారత పార్లమెంటులో రాజ్యాధిపతి లేదా రాష్ట్రపతి మరియు రెండు సభలు వుంటాయి. భారత రాష్ట్రపతి ఐదు సంవత్సరాల కొరకు ఎలక్టోరల్ కాలేజి చే ఎన్నుకోబడుతాడు. ఈ ఎలక్టోరల్ కాలేజిలో ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మరియు వివిధ రాష్ట్రాల ఎన్నికైన విధానసభ సభ్యులు ఉంటారు. భారత పార్లమెంటు ద్విసభా (బైకామెరల్) విధానాన్ని కలిగి, లోక్‌సభ మరియు రాజ్యసభను కలిగి ఉంది. లోక్‌సభలో 545 సభ్యులు ఉంటారు. ఈ సభ్యులలో 543 సభ్యులు భారత వోటర్లచే ఐదేండ్ల కొరకు ఎన్నుకోబడుతారు. రాష్ట్రపతిచే ఇద్దరు ఆంగ్లో-ఇండియన్ సభ్యులు నియమించబడుతారు. రాజ్య సభ లో 245 సభ్యులు గలరు, ఇందులో 233 సభ్యులు ఆరేండ్ల కొరకు ఎన్నుకోబడి, ప్రతి రెండేండ్లకు మూడవ వంతు సభ్యులు పదవీ విరమణ పొందే విధానాన్ని కలిగివుంటారు. అలాగే 12 మంది సభ్యులు కళాకారుల, జడ్జీల, క్రీడారంగ, వ్యాపారరంగ మరియు జర్నలిస్టుల మరియు సాధారణ ప్రజల సమూహాల నుండి రాష్ట్రపతిచే నామినేట్ చేయబడుతారు.

భారతదేశంలో ఎన్నికల చరిత్ర:--
-
మొదటి సారిగా ఎన్నికలు 1951 లో, 26 రాష్ట్రాలలో 489 లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగాయి. ఆ కాలంలో బహుసంఖ్య నియోజకవర్గాలుండేవి. అనగా ఒక నియోజకవర్గంలో 2 సీట్లు లేదా కొన్నిసార్లు 3 సీట్లు వుండేవి. 1960 లో ఈ విధానాన్ని రద్దుచేశారు.


రాజకీయ పార్టీల చరిత్ర:--

భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ఏకఛత్రాధిపత్యానికి 1977 లో మొదటి సారిగా విఘాతం గలిగినది. ఇందిరా గాంధీ నేతృత్వంలో ఈ పార్టీ మొదటిసారిగా ఓటమిని చవిచూసింది. అత్యవసర పరిస్థితి కాలంలో కాంగ్రెస్ యొక్క నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా 4 ప్రముఖ పార్టీలచే ఏర్పాటైన జనతా పార్టీ మురార్జీ దేశాయ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే 1989 లో రెండో సారి అధికారాన్ని కోల్పోగా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (వి.పి.సింగ్) నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ మరియు వామపక్షాల మద్దతుతో జనతాదళ్ ప్రభుత్వం ఏర్పడింది.

1992 లో మరియు ఆ తరువాత కేంద్రంలో ఏకపార్టీ గుత్తాధిపత్యం నశించి, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఈ వ్యవస్థలో అనేక పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో ప్రాంతీయ పార్టీలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, తెలుగుదేశం, అన్నా డి.యం.కె. అస్సాం గణపరిషత్, నేషనల్ ఫ్రంట్, లోక్‌దళ్, బహుజనసమాజ్ పార్టీ, లాంటివి ముఖ్యమైనవి.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్న "యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియెన్స్" కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విపక్షం లో ఉన్న "నేషనల్ డెమోక్రటిక్ అలియెన్స్" కూటమికి భాజపా నేతృత్వం వహిస్తున్నది.

భారత ఎన్నికల కమీషను:--


భారతదేశంలో ఎన్నికల నిర్వహణ భారత ఎన్నికల కమీషను ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కమీషనును భారత రాజ్యాంగం ఏర్పాటు చేసినది. ఈ ఎన్నికల కమీషను, న్యాయస్థానాలకు అతీతంగా పని చేస్తుంది. కొన్నిసార్లు తానే న్యాయస్థానంగా కూడా పనిచేస్తుంది. ఓటర్ల నమోదు కార్యక్రమం, ఓటర్ల గుర్తింపు కార్డుల విడుదల, ఎన్నికల నిర్వహణ, ఎన్నికల ఫలితాల ప్రకటన మొదలగు కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహిస్తుంది.


ఎన్నికల విధానము:--

ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగాలంటే, దాదాపు ఎన్నికల తతంగం ఒక నెల కాలం పాటు జరుగుతుంది. అవసరమైతే ఇంకొన్నాళ్ళు ఎక్కువనూ తీసుకోవచ్చు. ఓటర్ల నమోదు కార్యక్రమం, ఓటర్ల జాబితా తయారీ, ఓటర్ల జాబితా సవరణలు, క్లెయిములు వగైరా సాధారణ కార్యక్రమాలు జరుగుతాయి. భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కు అయినటు వంటి ఓటు హక్కు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారత పౌరుడు కలిగి వుంటాడు. ఓటర్ల జాబితాలో తమ పేర్లను చేర్చుట మరియు ఓటు హక్కు పొందుట ప్రతి భారత పౌరుని హక్కు మరియు విధి. సాధారణంగా, ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభంనకు ఓ వారం రోజుల ముందు నుంచే కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుంది.

[మార్చు] ఎన్నికలకు (పోలింగ్ కు) ముందు
ఎన్నికలకు ముందు, ఎలక్షన్ కమీషన్, ఎన్నికల, నామినేషన్ల, పోలింగ్ మరియు కౌంటింగ్ ల తేదీలను ప్రకటిస్తుంది. అలాగే ఎన్నికల కోడ్ లనూ ప్రకటిస్తుంది. కేంద్రస్థాయిలో కేంద్ర ఎన్నికల కమీషన్ రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల కమీషన్, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టరు ఎన్నికలను జరుపుటకు, సజావుగా సాగేందుకు కృషిచేస్తారు.

ఎన్నికల (పోలింగ్) రోజు:--


ఎన్నికల కేంద్రాలుగా, ప్రభుత్వ భవనాలను, పాఠశాలలను, కళాశాల భవనాలను ఉపయోగిస్తారు. ప్రతి గ్రామంలో, పట్టణాలలోనూ పాఠశాలలు ప్రజలకు అందుబాటులో వుంటాయి గనుక వీటిని పోలింగు కేంద్రాలుగా వుపయోగిస్తారు. పోలింగు రోజున మద్యపాన దుకాణాలను మూసివేస్తారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు శెలవు ప్రకటిస్తారు. ప్రజలందరూ ఎన్నికలలో పాల్గొను విధంగా ప్రజలకు పిలుపునిస్తారు.

పోలింగు కొరకు, ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లు ఉపయోగిస్తారు. పోలింగు అయిన తరువాత, ఈ మెషిన్లను, అత్యంత జాగరూకతతో భద్రపరుస్తారు. పోలింగు రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరుగకుండా, పోలీసువారి సహాయ సహకారాలు వుంటాయి. దొంగవోట్లు పోలవకుండా, బూత్ ఆక్రమణలు లాంటి చర్యలు జరుగకుండా చూస్తారు. ప్రజలందరూ ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకారాన్ని అందిస్తారు. పోలింగ్ బూత్ లలో, పోలింగు సిబ్బందిగా ప్రభుత్వ ఉద్యోగులను, ఉపాధ్యాయులను నియమించి, వారి సేవలను పొందుతారు.


ఎన్నికల (పోలింగ్) తరువాత:--


ఎలక్షన్ అయిన తరువాత, ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లను, ప్రకటింపబడిన వోట్లలెక్కింపు రోజున తెరచి, వోట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపడుతారు. దీనినీ ఎలక్షన్ కమీషనే నిర్వహిస్తుంది. ఎవరెవరికి ఎన్ని వోట్లు వచ్చాయో ప్రకటిస్తుంది. అలాగే గెలిచినవారినీ ప్రకటిస్తుంది. గెలిచినవారి జాబితాను దేశవ్యాప్తంగా ప్రకటించి, ఆయా జాబితాలను, గవర్నరుకూ, రాష్ట్రపతికీ అందజేయబడుతాయి. ఆతరువాత కార్యక్రమాన్ని, రాష్ట్రపతి కేంద్రస్థాయిలోనూ, గవర్నరు రాష్ట్రస్థాయిలోనూ చేపడుతారు.


వోటరు నమోదు విధానం:--

ఓటర్లు, తమ తమ మండల రెవెన్యూ కార్యాలయాలలోనూ, తహశీల్‌దారు కార్యాలయాలలోనూ తమ పేర్లు నమోదు చేసుకొన వచ్చును. ఈ ఆఫీసులు ఎలక్టోరల్ ఆఫీసులలాగా పనిచేస్తాయి. అలాగే కొన్ని నగరాలలో 'ఆన్-లైన్' సౌకర్యం ద్వారానూ తమ పేర్లను నమోదు చేసుకొనవచ్చును.

గైరుహాజరు వోటింగ్ (Absentee voting):--


ఎవరైనా వోటింగు రోజు గైర్హాజరు ఐనచో వారి వోటు వృధా అవుతుంది. దీని గురించి అనేక తర్జన భర్జనలు జరుగుతూనే వున్నాయి. కానీ భారత్ లో అధికారికంగా "గైర్హాజరు వోటింగు విధాన"మంటూ ఏమీ లేదు.[2]

ఎన్నికల సంస్కరణలు:--

భారత ఎన్నికల కమీషను ద్వారా ప్రతిపాదింపబడిన ఎన్నికల సంస్కరణలు: [1]


భారత ఎన్నికల ప్రక్రియ పట్ల అభిప్రాయాలు:--

భారత్ లో ఎన్నికల వ్యవస్థ మరియు ప్రక్రియ అందరికీ గర్వకారణమని అమెరికా ప్రశంసించింది. ఈ విషయం పట్ల అందరూ గర్వించాలని వైట్ హౌస్ ప్రకటించింది. [3]

పంచాయితీ

పంచాయితీ గ్రామం స్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీనమైన పాలనా వ్యవస్థ. దీనినే స్థానిక స్వపరిపాలన సంస్థల వ్యవస్థని , భారత దేశంలో పంచాయతీ రాజ్ అని అంటారు. నేపాల్ లో కూడా ఇలాంటి పంచాయితీ వ్యవస్థ నడుస్తుంది.

పంచాయితీ రాజ్ చరిత్ర:--


ప్రాచీనకాలంలో పనిచేస్తున్న గ్రామ పాలనా వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితుల కనుగుణంగా ఐదు ప్రధాన వృత్తుల ప్రతినిధులతో పనిచేశేవి. అయితే ఇవి ఎక్కువగా అణచివేతకు గురయ్యేవి. బ్రిటిష్ పాలన ప్రారంభంలో అంతగా ఆదరించబడనప్పటికీ గవర్నర్ జనరల్ రిప్పన్ ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనా సంస్థలు పునరుజ్జీవనం పొందాయి. 1919 మరియు 1935 భారత ప్రభుత్వ చట్టాలు కొంతమేరకు వీటికి బలం చేకూర్చాయి. భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్ కాగా, 1959 నవంబర్ 1న, ఆంధ్ర ప్రదేశ్ లో దేశంలోనే రెండవదిగా, మహబూబ్ నగర్ జిల్లా షాద్‌నగర్ లో ప్రారంభమైంది. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, బ్లాకు స్ధాయిలో పంచాయతి సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ గా ఏర్పడింది. 1986 లో బ్లాకు స్ధాయి వ్యవస్థని మండల పరిషత్ గా మార్చారు.

73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1994లో నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని చేసింది. [1]ప్రస్తుత వ్యవస్థ దీనికి అనుగుణంగా వుంది. కేంద్రంలో గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ [2] రాష్ట్రాలలోని అటువంటి మంత్రిత్వ శాఖలతో [3] కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఏప్రిల్ 24 ని పంచాయతిరాజ్ దినంగా పాటిస్తున్నారు.

ఇంచుమించు 30 లక్షల మంది ప్రజా ప్రతినిధులతో నడుస్తున్న పంచాయితీ రాజ్ వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రధానంగా మన గ్రామాలకు ఇది వెన్నెముకగా పనిచేస్తుంది. దేశ వ్యాప్తంగా 537 జిల్లా పంచాయితీలు, 6,097 మండల పంచాయితీలు మరియు 2,34,676 గ్రామ పంచాయితీలు పనిచేస్తున్నాయి.

పరిశోధన, శిక్షణ, విద్యాబోధన కోసం కేంద్ర స్థాయిలో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ , రాష్ట్ర పరిధిలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి అకాడమీ,[4] పనిచేస్తున్నాయి. ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల కమీషన్ [5] నిర్వహిస్తుంది.

ముఖ్యమంత్రి

భారతదేశంలో రాష్ట్రాల ప్రభుత్వాధినేతను ముఖ్యమంత్రి అంటారు. శాసనసభలో కనీస ఆధిక్యత కలిగిన పార్టీ లేదా కూటమికి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి శాసనసభ లేదా శాసనమండలి సభ్యుడై ఉండాలి. అయితే ఏ సభలోనూ సభ్యుడు కాకున్నా ముఖ్యమంత్రి పదవి చేపట్టవచ్చు, కానీ 6 నెలలలోపు ఏదో ఒక సభలో సభ్యత్వం పొందాలి.


ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి రాష్ట్ర పరిపాలనకు బాధ్యుడు. గవర్నరు పేరిట పరిపాలన జరిగినప్పటికీ, అధికారం యావత్తూ ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. పరిపాలనలో తనకు సహాయంగా ఉండేందుకు మంత్రివర్గాన్ని నియమించుకుంటారు.

వివిధ రాష్ట్రాల ప్రస్తుత ముఖ్యమంత్రుల జాబితా:

రాష్ట్రం పేరు పదవీ స్వీకారం పార్టీ జాబితా
ఆంధ్ర ప్రదేశ్ కొణిజేటి రోశయ్య Y.S అనంతరం కాంగ్రెసు పార్టీ అందరు
అరుణాచల్ ప్రదేశ్ దోర్జీ ఖండూ కాంగ్రెసు పార్టీ అందరు
అస్సాం తరుణ్ కుమార్ గోగోయి 2001 మే 17 కాంగ్రెసు పార్టీ అందరు
బీహార్ నితీష్ కుమార్ 2005 నవంబర్ 24 జనతా దళ్ (యునైటెడ్) అందరు
చత్తీస్‌గఢ్ డా. రమణ్ సింగ్ భారతీయ జనతా పార్టీ అందరు
ఢిల్లీ షీలా దీక్షిత్ కాంగ్రెసు పార్టీ అందరు
గోవా దిగంబర్ కామత్ కాంగ్రెసు పార్టీ అందరు
గుజరాత్ నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ అందరు
హర్యానా భూపిందర్ సింగ్ హూడా కాంగ్రెసు పార్టీ అందరు
హిమాచల్ ప్రదేశ్ ప్రేమ్ కుమార్ ధుమాల్ 2007 డిసెంబర్ 29 భారతీయ జనతా పార్టీ అందరు
జమ్మూ కాశ్మీరు గులాం నబీ ఆజాద్ కాంగ్రెసు పార్టీ అందరు
జార్ఖండ్ శిబూ సోరెన్ 2008, ఆగస్టు 29 అందరు
కర్ణాటక బి.ఎస్.యడ్యూరప్ప 2008 మే 30 భారతీయ జనతా పార్టీ అందరు
కేరళ వి.ఎస్.అచ్యుతానందన్ ఎల్.డి.ఎఫ్ అందరు
మధ్య ప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌహాన్ 2005 నవంబర్ 29 భారతీయ జనతా పార్టీ అందరు
మహారాష్ట్ర విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కాంగ్రెసు పార్టీ అందరు
మణిపూర్ ఓక్రాం ఇబోబి సింగ్ కాంగ్రెసు పార్టీ అందరు
మేఘాలయ డి.డి.లపాంగ్ కాంగ్రెసు పార్టీ అందరు
మిజోరం పు జొరోంతంగా మిజో నేషనల్ ఫ్రంటు అందరు
నాగాలాండ్ రాష్ట్రపతి పాలన జనవరి 4, 2008 అందరు
ఒరిస్సా నవీన్ పట్నాయిక్ బిజూ జనతా దళ్ అందరు
పాండిచ్చేరి ఎన్.రంగస్వామి కాంగ్రెసు పార్టీ అందరు
పంజాబ్ ప్రకాశ్ సింగ్ బాదల్ శిరోమణి అకాలీదళ్ అందరు
రాజస్థాన్ వసుంధర రాజె సింధియా భారతీయ జనతా పార్టీ అందరు
సిక్కిం పవన్ చామ్లింగ్ సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంటు అందరు
తమిళనాడు కరుణానిధి డి.ఎం.కె కూటమి అందరు
త్రిపుర మాణిక్ సర్కార్ వామపక్ష ఫ్రంటు అందరు
ఉత్తరాంచల్ బి.సి.ఖండూరి భారతీయ జనతా పార్టీ అందరు
ఉత్తర ప్రదేశ్ మాయావతి బహుజన్ సమాజ్ పార్టీ అందరు
పశ్చిమ బెంగాల్ బుద్ధదేబ్ భట్టాచార్య వామపక్ష ఫ్రంటు అందరు

గవర్నరు

భారత దేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నరు ఉంటారు. ముఖ్యమంత్రి ప్రభుత్వాధినేత కాగా, గవర్నరు రాష్ట్రాధినేతగా వ్యవహరిస్తారు. గవర్నరు పదవి నామకార్థమైనది. భారత రాష్ట్రపతికి రాష్ట్రంలో ప్రతినిధిగా గవర్నరు వ్యవహరిస్తారు. 5 సంవత్సరాల పదవీకాలానికి గాను గవర్నరును రాష్ట్రపతి నియమిస్తారు.


అధికారాలు, విధులు:--


గవర్నరుకు కింది అధికారాలు ఉంటాయి:

కార్యనిర్వాహక అధికారాలు : పరిపాలన, నియామకాలు, తొలగింపులు
శాసన అధికారాలు : రాష్ట్ర శాసనసభ, శాసనమండలికి సంబంధించిన అధికారాలు
విచక్షణాధికారాలు : తన విచక్షణను ఉపయోగించగల అధికారాలు.


కొందరు గవర్నర్ల వివాదాస్పద వ్యాఖ్యలు:--


కర్నాటక 'రాష్ట్రంలో అగ్రవర్ణాల వారు క్షేమంగా ఉన్నారు. అభద్రత భావన గురించి అల్ప సంఖ్యాకుల నుంచి ఫిర్యాదుల మీదు ఫిర్యాదులు అందుతున్నాయి.చట్ట వ్యతిరేక సంస్థలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నాయి'.రాష్ట్రంలో అల్పసంఖ్యాకులు అభద్రతా భావనతో భీతిల్లుతున్నారు--- గవర్నర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ http://www.eenadu.net/district/districtshow1.asp?dis=karnataka

శాసనమండలి

భారత దేశము యొక్క రాష్ట్రాల శాసన వ్యవస్థలో రెండవ సభను శాసనమండలి అంటారు. 28 రాష్ట్రాలలో కేవలం 6 రాష్ట్రాలలో మాత్రమే ప్రస్తుతం శాసనమండలి ఉన్నది. అవి ఉత్తర ప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీరు,ఆంధ్ర ప్రదేశ్. రెండు సభలు కలిగిన రాష్ట్రాల శాసన వ్యవస్థలో ఇది ఎగువ సభ. శాసన మండలి సభ్యులు ప్రజలచే పరోక్షముగా ఎన్నికౌతారు. ఇది శాశ్వత సభ. అనగా శాసన సభ వలె దీన్ని రద్దు చేయలేము. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడొంతుల సభకు ఎన్నికలు జరుపుతారు. శాసన మండలి సభ్యుని పదవీకాలం 6 సంవత్సరాలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మొత్తం సభ్యుల స్థానాల సంఖ్య 90 [1]



సభ్యుల అర్హతలు:--

శాసనమండలి సభ్యుడు కాదలచిన వ్యక్తి భారత పౌరుడై ఉండాలి.
కనీసం 30 ఏళ్ళ వయసు ఉండాలి.
మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి.
దివాళా తీసి ఉండరాదు.


సభా సభ్యత్వం:--


శాసన మండలి సభ్యుల సంఖ్య ఆయా రాష్ట్రాల శాసన సభ్యుల సంఖ్యలో మూడో వంతు కంటే మించరాదు. కానీ సభ్యుల సంఖ్య 40 కి తగ్గరాదు. (జమ్మూ కాశ్మీరు శాసన మండలిలో 32 మంది సభ్యులే ఉండటం చేత ప్రత్యేక పార్లమెంటు చట్టము వలన అనుమతించబడినది). శాసన మండలి సభ్యులలో ఆరోవంతు (1/6) మంది సభ్యులు గవర్నరు చే నియమించబడతారు. వీరు శాస్త్రము, కళలు, సామాజిక సేవ మరియు ఇతర రంగములలో రాణించినవారై ఉంటారు. ఇంకొక మూడోవంతు (1/3) మందిని స్థానిక ప్రభుత్వ సంస్థలు ఎన్నుకుంటాయి. పన్నెండో వంతు (1/12) మందిని ఉన్నత పాఠశాలల, కళాశాలల, విశ్వవిద్యాలయాల అధ్యాపకులు ఎన్నుకొంటారు. మరో పన్నెండో వంతు (1/12) మందిని పట్టభద్రులు ఎన్నుకొంటారు.

శాసనసభ

ప్రతి రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకునే సభ్యులతో కూడిన ఒక సభ ఉంటుంది. దీన్ని శాసనసభ లేదా విధానసభ అంటారు. కొన్ని రాష్ట్రాల్లో రెండు సభలుంటాయి. ఈ రెండో సభను శాసనమండలి అంటారు. రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్రం లోనైనా శాసనసభలో 500 కంటే ఎక్కువ కాకుండాను, 60 కంటే తక్కువ కాకుండాను స్థానాలు ఉండాలి

సభ్యుల అర్హతలు
శాసనసభ సభ్యుడు కాదలచిన వ్యక్తి భారత పౌరుడై ఉండాలి
కనీసం 25 ఏళ్ళ వయసు ఉండాలి

సభానిర్వహణ
సభా నిర్వహణ బాధ్యతలు నిర్వహించేందుకు ఒక సభాపతి (స్పీకరు)ని, ఒక ఉపసభాపతి (డిప్యూటీ స్పీకరు) ని సభ్యుల నుండి ఎన్నుకుంటారు. సాంప్రదాయికంగా సభాపతి గా అధికార పక్షానికి, ఉపసభాపతి గా ప్రతిపక్షానికి చెందిన వారిని ఎన్నుకుంటారు. అయితే ఇది నియమం కాదు.


తమ పదవికి రాజీనామా సమర్పించదలచిన పక్షంలో సభాపతి ఉపసభాపతి కి, ఉపసభాపతి సభాపతి కి సమర్పించాలి. వారి తొలగింపుకు మెజారిటీ సభ్యుల మద్దతు అవసరం.


సమావేశాలు
శాసనసభను సమావేశపరచడం, సమావేశాలను ముగించడం, సభను రద్దు చెయ్యడం వంటి అధికారాలు గవర్నరు వద్ద ఉంటాయి. శాసనసభ సమావేశాల చివరి రోజుకు, తదుపరి సమావేశాల మొదటి రోజుకు మధ్య 6 నెలలకు మించి అంతరం ఉండరాదు. సభలో సభ్యులు కాని రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు, రాష్ట్ర అడ్వొకేటు జనరల్ సభనుద్దేశించి ప్రసంగించవచ్చు, సభా కమిటీలలో పాల్గొనవచ్చు. కాని వారికి సభలో ఓటు వేసే అధికారం ఉండదు

హైకోర్టు

హైకోర్టు (ఆంగ్లం: High Court) అనగా భారతదేశంలో రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం. ప్రతీ రాష్ట్రానికీ, కేంద్ర పాలిత ప్రాంతానికీ ఒక్కో హైకోర్టు ఉంటుంది. రెండు లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా ఒకే హైకోర్టు ఉండేటట్లు పార్లమెంటు చట్టం చేయవచ్చు.హైకోర్టులు భారత రాజ్యాంగంలోని ఆరవ భాగము, ఐదవ అధ్యాయము, 214 వ నిభంధననుసరించి ఏర్పాటు చేయడం జరిగింది.

హైకోర్టు న్యాయమూర్తులను భారత ప్రధాన న్యాయమూర్తి మరియు రాష్ట్ర గవర్నర్ సలహాపై, భారత రాష్ట్రపతి నియమిస్తాడు.

మొత్తం భారతదేశంలో 21 హైకోర్టు‌లు ఉన్నాయి. ఒక్కొక్క హైకోర్టు‌లో ఒక్కొక ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర గవర్నర్‌ను సంప్రదించి. రాష్ట్రంలో ఏ ఇతర కోర్టులలో జరిగిన కేసుల పై న్యాయ విచారణ కోసం హైకోర్ట్‌ను సంప్రదించవచ్చు.

హైకోర్టు న్యాయ మూర్తి పదవీ అర్హతలు:

భారత దేశ పౌరుడై ఉండాలి.
కనీసం 10 సంవత్సరాలు పాటు దిగువ కోర్ట్‌లో న్యాయమూర్తిగా లేదా హైకోర్టులలో 10 సంవత్సరాలు న్యాయవాదిగా, లేదా న్యాయ శాస్త్రవేత్తగా ఉండాలి.

హైకోర్టులు:--

భారతదేశం లో గల, క్రింది ఇరవైన్నొక్క (21) హైకోర్టుల జాబితాను చూడండి.




కోర్టు పేరు స్థాపించిన సంవత్సరం ఏ ఆక్టు ద్వారా స్థాపించారు పరిధి సీటు బెంచీలు న్యాయమూర్తులు.
అలహాబాదు హైకోర్టు[1] 1866-06-11 హైకోర్టుల ఆక్టు, 1861 ఉత్తర ప్రదేశ్ అలహాబాదు లక్నో 95
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1954-07-05 ఆంధ్ర రాష్ట్ర ఆక్టు, 1953 ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు 39
బాంబే హైకోర్టు 1862-08-14 హైకోర్టుల ఆక్టు, 1861 మహారాష్ట్ర, గోవా, దాద్రా మరియు నాగర్ హవేలీ, డామన్ మరియు డయ్యూ ముంబై నాగపూర్, పనాజీ, ఔరంగాబాదు 60
కలకత్తా హైకోర్టు 1862-07-02 హైకోర్టుల ఆక్టు, 1861 పశ్చిమ బెంగాల్, అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలు కోల్కతా పోర్ట్ బ్లెయిర్ (సర్క్యూట్ బెంచీ) 63
ఛతీస్ గఢ్ హైకోర్టు 2000-01-11 మధ్యప్రదేశ్ రీ-ఆర్గనైజేషన్ ఆక్టు, 2000 ఛత్తీస్ గఢ్ బిలాస్ పూర్ 08
ఢిల్లీ హైకోర్టు[2] 1966-10-31 ఢిల్లీ హైకోర్టు ఆక్టు, 1966 నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఢిల్లీ న్యూఢిల్లీ 36
గౌహతి హైకోర్టు[3] 1948-03-01 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్టు, 1935 అరునాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయా, నాగాల్యాండ్, త్రిపుర, మిజోరం గౌహతి కోహిమా, ఐజాల్ & ఇంఫాల్. Agartala & Shillong లలో సర్క్యూట్ బెంచీ గలదు. 27
గుజరాత్ హైకోర్టు 1960-05-01 బాంబే రీ ఆర్గనైజేషన్ ఆక్టు, 1960 గుజరాత్ అహ్మదాబాదు 42
హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు 1971 స్టేట్ ఆఫ్ హి.ప్ర. ఆక్టు, 1970 హిమాచల్ ప్రదేశ్ సిమ్లా 09
జమ్మూ మరియు కాశ్మీరు హైకోర్టు 1943-08-28 కాశ్మీరు మహారాజు జారీచేసిన పేటెంటు లేఖ జమ్మూ & కాశ్మీరు శ్రీనగర్ & జమ్మూ[4] 14
జార్ఖండ్ హైకోర్టు 2000 బీహారు రీ ఆర్గనైజేషన్ ఆక్టు, 2000 జార్ఖండ్ రాంచీ 12
కర్నాటక హైకోర్టు[5] 1884 మైసూరు హైకోర్టు ఆక్టు, 1884 కర్నాటక బెంగళూరు 40
కేరళ హైకోర్టు[6] 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956. కేరళ, లక్షద్వీప్ కొచ్చి 40
మధ్యప్రదేశ్ హైకోర్టు[7] 1936-01-02 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్టు, 1935 మధ్యప్రదేశ్ జబల్ పూర్ గ్వాలియర్, ఇండోర్ 42
మద్రాసు హైకోర్టు 1862-08-15 హైకోర్టు ఆక్ట, 1861 తమిళనాడు, పాండిచ్చేరి చెన్నై మదురై 47
ఒరిస్సా హైకోర్టు 1948-04-03 ఒరిస్సా హైకోర్టు ఆర్డరు, 1948 ఒరిస్సా కటక్ 27
పాట్నా హైకోర్టు 1916-09-02 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్టు, 1915 బీహారు పాట్నా 43
పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు[8] 1947-11-08 హైకోర్టు (పంజాబ్) ఆర్డరు, 1947 పంజాబ్, హర్యానా, చంఢీగఢ్ చండీగఢ్ 53
రాజస్థాన్ హైకోర్టు 1949-06-21 రాజస్థాన్ హైకోర్టు ఆర్డినెన్స్, 1949 రాజస్థాన్ జోధ్ పూర్ జైపూరు 40
సిక్కిం హైకోర్టు 1975 38వ సవరణ సిక్కిం గాంగ్ టక్ 03
ఉత్తరాంచల్ హైకోర్టు 2000 యూ.పీ. రీ ఆర్గనైజేషన్ ఆక్టు, 2000 ఉత్తరాంచల్ నైనితాల్ 09

అత్యధిక న్యాయమూర్తులు అహ్మదాబాద్ హైకొర్ట్ కు ఉన్నారు.



1.↑ ప్రారంభంగా ఆగ్రా లో స్థాపించారు. 1875 లో అలహాబాదుకు మార్చారు.
2.↑ లాహోర్ హైకోర్టు 1919-03-21 లో స్థాపించారు. పరిధి, అవిభాజ్య పంజాబ్ మరియు ఢిల్లీ. 1947-08-11 లో ఒక ప్రత్యేక హైకోర్టు ఆఫ్ పంజాబ్ స్థాపించబడినది, భారతీయ స్వాతంత్ర్య ఆక్టు 1947, ప్రకారం సిమ్లా లో ఒక సీటును ఏర్పాటు చేశారు. 1966 లో పంజాబ్ గుర్తింపబడిన తరువాత, పంజాబ్ హర్యానాల కొరకు ఒక హైకోర్టును స్థాపించారు. ఢిల్లీ హైకోర్టు, 1966-10-31 లో, సిమ్లాలో ఒక సీటుతో స్థాపించారు.
3.↑ మూలంగా ఇది అస్సాం మరియు నాగాల్యాండ్ కొరకు స్థాపింపబడింది. 1971 లో దీనికి గౌహతి హైకోర్టు ఈశాన్యభారత రీ-ఆర్గనైజేషన్ ఆక్టు, 1971, ప్రకారం పేరు పెట్టారు.
4.↑ వేసవిలో రాజధాని శ్రీనగర్, శీతాకాలంలో జమ్మూ.
5.↑ మూలంగా దీనిని మైసూరు హైకోర్టు అనేవారు, తరువాత కర్నాటక హైకోర్టు అని పేరు 1973.
6.↑ ట్రావంకూర్-కొచ్చిన్ హైకోర్టు, ఎర్నాకుళంలో 1949 లో జూలై 7 న ఉద్ఘాటన చేశారు. కేరళ్ రాష్ట్రం, రాష్ట్రాల రీ ఆర్గనైజేషన్ ఆక్ట్ 1956 ప్రకారం ఏర్పడింది. ఈ ఆక్టు ట్రావంకూర్-కొచ్చిన్ హైకోర్టును అబాలిష్ చేసి కేరళ హైకోర్టును సృష్టించింది. దీని పరిధి, లక్షద్వీప్ వరకు గలదు.
7.↑ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్టు, 1935, లెటర్ పేటెంట్ ద్వారా 2-1-1936 న ఒక హైకోర్టు నాగపూర్ నందు స్థాపించబదింది. రాష్ట్రాలు ఏర్పడిన తరువాత జబల్ పూర్ కు మార్చబడింది, 1956.
8.↑ మూలంగా పంజాబ్ హైకోర్టు, తరువాత పంజాబ్ & హర్యానా హైకోర్టు గా మారింది, 1966


హైకోర్టులు రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల వారీగా:--


రాష్ట్రం లేదా కే.పా.ప్రా. కోర్టు నగరం
అండమాన్ మరియు నికోబార్ దీవులు కలకత్తా హైకోర్టు కోల్కతా
అరుణాచల్ ప్రదేశ్ గౌహతి హైకోర్టు గౌహతి
ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హైదరాబాదు
అస్సాం గౌహతి హైకోర్టు గౌహతి
బీహారు పాట్నా హైకోర్టు పాట్నా
ఛత్తీస్‌గఢ్ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు బిలాస్ పూర్
చండీగఢ్ పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు చండీగఢ్
దాద్రా నగర్ హవేలీ బాంబే హైకోర్టు ముంబై
డామన్ మరియు డయ్యు బాంబే హైకోర్టు ముంబై
జాతీయ రాజధాని ప్రాంతం న్యూఢిల్లీ ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ
గోవా బాంబే హైకోర్టు ముంబై
గుజరాత్ గుజరాత్ హైకోర్టు అహ్మదాబాదు
హర్యానా పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు చండీగఢ్
హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సిమ్లా
జమ్మూ కాశ్మీరు జమ్మూ మరియు కాశ్మీరు హైకోర్టు శ్రీనగర్/జమ్మూ
జార్ఖండ్ జార్ఖండ్ హైకోర్టు రాంచీ
కర్నాటక కర్నాటక హైకోర్టు బెంగళూరు
కేరళ కేరళ హైకోర్టు కోచి
లక్షద్వీప్ కేరళ హైకోర్టు కోచి
మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ హైకోర్టు జబల్‌పూర్
మహారాష్ట్ర బాంబే హైకోర్టు ముంబై
మణిపూర్ గౌహతి గౌహతి
మేఘాలయ గౌహతి హైకోర్టు గౌహతి
మిజోరం గౌహతి హైకోర్టు గౌహతి
నాగాలాండ్ గౌహతి హైకోర్టు గౌహతి
ఒరిస్సా ఒరిస్సా హైకోర్టు కటక్
పాండిచ్చేరి మద్రాసు హైకోర్టు చెన్నై
పంజాబ్ పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు చండీగఢ్
రాజస్థాన్ రాజస్థాన్ హైకోర్టు జోధ్‌పూర్
సిక్కిం సిక్కిం హైకోర్టు గాంగ్ టక్
తమిళనాడు మద్రాసు హైకోర్టు చెన్నై
త్రిపుర గౌహతి హైకోర్టు గౌహతి
ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ హైకోర్టు నైనితాల్
ఉత్తరప్రదేశ్ అలహాబాదు హైకోర్టు అలహాబాదు
పశ్చిమ బెంగాల్ కలకత్తా హైకోర్టు కోల్కతా

సుప్రీం కోర్టు

భారత దేశములోని అత్యున్నత న్యాయస్థానమే సుప్రీం కోర్టు (ఆంగ్లం: Supreme Court) . ఇది ఎటువంటి రాజకీయ జోక్యానికి తావులేని రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర్య న్యాయ వ్యవస్థ. ఇది హైకోర్టులపై నియంత్రణాధికారం కల్గిఉన్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాపైననే రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. ఇందులో 26 మంది జడ్జీలు ఉంటారు ప్రధాన న్యాయ మూర్తితో కలిపి. ఈ కోర్టులలో

భారత ప్రభుత్వానికి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య తగాదాలను
భారత ప్రభుత్వం, ఒకటి లేదా కొన్ని రాష్ట్రాలు ఒక వైపు ఒకటి లేదా కొన్ని రాష్ట్రాలు ఇంకొక వైపు ఉన్నప్పుడు వాటి మధ్య తగాదాలను
రెండు అంత కంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య తగాదాలను పరిష్కరిస్తుంటాయి.
ఇందులో సివిల్ కేసు అయినా, క్రిమినల్ కేసు అయినా, ఇతర ఏ కేసు అయినా హైకోర్టు‌లో జరుగుతూ ఉన్నా, ఆఖరి తీర్పు అయిపోయినా మనము ఈ కోర్టు‌లో (న్యాయస్థానంలో) ఫిర్యాదు చేసుకోవచ్చు.

సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవీ అర్హతలు:

భారతదేశ పౌరుడై ఉండాలి.
కనీసం 5 సంవత్సరాల కాలం హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి.లేదా 10 సంవత్సరాలు హైకోర్టులో అడ్వకేట్ వృత్తి నిర్వహించి ఉండాలి లేదా ప్రముఖ న్యాయ శాస్త్రవేత్త అయి ఉండాలి.



భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు:--

భారత ప్రధాన న్యాయస్థానమును సుప్రీం కోర్టుగా పిలుస్తారు. సుప్రీం కోర్టులో పని చేసిన ప్రధాన న్యాయమూర్తులు వారి జాబితా.




01 హరిలాల్ జె. కనియా 15 August 1947 16 November 1951 Bombay (now Mumbai) AK Gopalan v. Union of India
02 ఎం.పతంజలి శాస్త్రి 16 November 1951 3 January 1954 Madras (now Chennai)
03 మెహర్ చంద్ మహాజన్ 3 January 1954 22 December 1954 Lahore/Kashmir
04 బి.కె.ముఖర్జియా 22 December 1954 31 January 1956 West Bengal
05 ఎస్.ఆర్.దాస్ 31 January 1956 30 September 1959 West Bengal
06 భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా 30 September 1959 31 January 1964 Bihar
07 పి.బి.గజేంద్ర ఘడ్కర్ 31 January 1964 15 March 1966 Bombay (now Maharashtra)
08 ఏ.కె.సర్కార్ 16 March 1966 29 June 1966 West Bengal
09 కోకా సుబ్బారావు 30 June 1966 11 April 1967 Madras (now Tamil Nadu) Golak Nath vs. The State of Punjab
10 కైలాశ్ నాథ్ వాన్చూ 12 April 1967 24 February 1968 Uttar Pradesh
11 ఎమ్.హిదయతుల్లా 25 February 1968 16 December 1970 present Chattisgarh
12 జె.సి.షా 17 December 1970 21 January 1971 present Gujarat
13 ఎస్.ఎమ్.సిక్రి 22 January 1971 25 April 1973 Punjab Kesavananda Bharati vs. The State of Kerala
14 ఏ.ఎన్.రే 25 April 1973 28 January 1977 West Bengal ADM Jabalpur v. Shivakant Shukla
15 మిర్జా హమీదుల్లా బెగ్ 29 January 1977 21 February 1978 Uttar Pradesh
16 వై.వి.చంద్రచూడ్ 22 February 1978 11 July 1985 Bombay (now Maharashtra)
17 పి.ఎన్.భగవతి 12 July 1985 20 December 1986 Bombay (now Maharashtra)
18 ఆర్.ఎస్.పాథక్ 21 December 1986 6 June 1989 Uttar Pradesh
19 ఈ.ఎస్.వెంకటరామయ్య 19 June 1989 17 December 1989 Mysore (now Karnataka)
20 ఎస్.ముఖర్జీ 18 December 1989 25 September 1990 West Bengal
21 రంగనాథ్ మిశ్రా 25 September 1990 24 November 1991 Orissa
22 కమల్ నారాయణ్ సింగ్ 25 November 1991 12 December 1991 Uttar Pradesh
23 ఎం.హెచ్.కనియా 13 December 1991 17 November 1992 Maharashtra
24 లలిత్ మోహన్ శర్మ 18 November 1992 11 February 1993 Bihar
25 ఎమ్.ఎన్.వెంకటాచలయ్య 12 February 1993 24 October 1994 Karnataka
26 ఏ.ఎమ్.అహ్మది 25 October 1994 24 March 1997 Gujarat
27 జె.ఎస్.వర్మ 25 March 1997 18 January 1998 Madhya Pradesh
28 ఎమ్.ఎమ్.పుంఛి 18 January 1998 9 October 1998 Punjab
29 ఏ.ఎస్.ఆనంద్ 10 October 1998 1 November 2001 Jammu & Kashmir
30 ఎస్.పి.భరుచా 2 November 2001 6 May 2002 Maharashtra
31 బి.ఎన్.కిర్పాల్ 6 May 2002 11 November 2002 Delhi
32 జి.బి.పట్నాయక్ 11 November 2002 19 December 2002 Orissa
33 వి.ఎన్.ఖారే 19 December 2002 2 May 2004 Uttar Pradesh Best Bakery Case, T.M.A. Pai v. Union of India (reservation in private educational institutions)
34 రాజేంద్ర బాబు 2 May 2004 1 June 2004 Karnataka
35 ఆర్.సి.లహోటి 1 June 2004 1 November 2005 Uttar Pradesh
36 యోగేష్ కుమార్ సభర్వాల్ 1 November 2005 14 January 2007 Delhi Land Ceiling Case (M.C. Mehta v. Union of India)
37 కె.జి.బాలకృష్ణన్ 14 January 2007 (incumbent) Kerala OBC Reservation case (Ashok Kumar Thakur v. Union of India)

రాజ్యసభ

భారత పార్లమెంటు లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ అంటే రాష్ట్రాల సభ అని అర్థం. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఎన్నుకుంటారు. అందుకే దీన్ని రాష్ట్రాల సభ అంటారు. దీని సభ్యుల సంఖ్య 250. ఇందులో 12 స్థానాలకు వివిధ రంగాల్లో ప్రసిద్ధులైన వారిని రాష్ట్రపతి నామినేటు చేస్తారు. సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. ప్రతి రెండేళ్ళకు ఒకసారి మూడో వంతు సభ్యుల పదవీకాలం పూర్తవుతుంది. ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.

రాజ్యసభకు సభాపతి (చైర్మను) గా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు. సభ్యుల నుండి ఒకరిని ఉపసభాపతిగా ఎన్నుకుంటారు. లోక్‌సభ వలె రాజ్యసభ రద్దు కావడం అనేది ఉండదు. లోక్‌సభ వలెనే రాజ్యసభకు కూడా శాసనాధికారం ఉంటుంది. అయితే ఆర్థిక బిల్లులకు సంబంధించి, రాజ్యసభ నిర్ణయాన్ని తోసిరాజనే అధికారం లోక్‌సభకు ఉంది. ఇతర బిల్లులకు సంబంధించి ఇరు సభల మధ్యా వివాదం తలెత్తినపుడు రెండు సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తారు. అయితే రాజ్యాంగ సవరణకు సంబంధించిన విషయాల్లో రెండు సభల్లోనూ అంగీకారం పొందితేనే అది సాధ్యపడుతుంది. రాజ్యసభలో ఏదైనా విషయంపై ఓటింగు జరిపినపుడు, సమాన సంఖ్యలో ఓట్లు వచ్చినపుడు, సభాపతి తన నిర్ణాయక ఓటును వేస్తారు.

రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులకు ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసే అధికారం ఉంది. అయితే రాష్ట్రపతి ఎన్నికలో మాత్రం వీరికి ఓటేసే అధికారం లేదు.

లోక్ సభ స్పీకర్

లోక్‌సభ నిర్వహణ బాధ్యత ను స్పీకర్ నిర్వహిస్తారు. లోక్‌సభా సభ్యులు తమలో ఒకరిని స్పీకర్‌గా ఎన్నుకుంటారు. స్పీకర్‌కు సహాయంగా ఒక డిప్యూటీ స్పీకర్‌ను కూడా ఎనుకుంటారు. సార్వత్రిక ఎన్నికల తరువాత సభ్యుల ప్రమాణ స్వీకారంతో లోక్‌సభ ఏర్పాటు అవుతుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమ నిర్వహణకు ఒక తాత్కాలిక స్పీకరును సభులలో ఒకరిని ఎంచుకుంటారు. సాధారణంగా అనుభవజ్ఞుడైన సభ్యుని ఎంచుకోవడం రివాజు. తరువాత స్పీకరు ఎన్నిక జరుగుతుంది. ఆపై, సభా నిర్వహణ బాధ్యత పూర్తిగా స్పీకరుదే. సభానిర్వహణ కొరకు వివిధ నిబంధనలు ఏర్పాటయ్యాయి. సభ్యుల ప్రవర్తనను నిర్దేశిస్తూ ప్రవర్తనా నియమావళి ఉంది. వివిధ అంశాలకు సమయం కేటాయింపు కొరకు బిజినెస్ ఎడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది.


లోక్ సభ స్పీకర్ యొక్క విధులు, అధికారాలు:--

లోక్‌సభా నిర్వహణ బాధ్యత ను స్పీకర్ నిర్వహిస్తారు.


లోక్ సభ స్పీకర్ల జాబితా:--


అం పేరు వ్యవధి పార్టి కూటమి


1 గనేశ్ వాసుదేవ్ మావలనకార్ మే 15, 1952 - ఫిబ్రవరి 27, 1956 భారత జాతీయ కాంగ్రేసు భారత జాతీయ కాంగ్రేసు+
2 మాడభూషి అనంతశయనం అయ్యంగారు మార్చి 8, 1956 - ఏప్రిల్ 16, 1962 భారత జాతీయ కాంగ్రేసు భారత జాతీయ కాంగ్రేసు+
3 సర్దార్ హుకమ్ సింగ్ ఏప్రిల్ 17, 1962 - మార్చి 16, 1967 భారత జాతీయ కాంగ్రేసు భారత జాతీయ కాంగ్రేసు+
4 నీలం సంజీవరెడ్డి మార్చి 17, 1967 - జులై 19, 1969 భారత జాతీయ కాంగ్రేసు భారత జాతీయ కాంగ్రేసు+
5 జి. యస్. ధిల్లొన్ ఆగష్టు 8, 1969 - డిసెంబర్ 1, 1975 భారత జాతీయ కాంగ్రేసు భారత జాతీయ కాంగ్రేసు+
6 బలి రామ్ భగత్ జనవరి 15, 1976 - మార్చి 25, 1977 భారత జాతీయ కాంగ్రేసు భారత జాతీయ కాంగ్రేసు+
7 నీలం సంజీవరెడ్డి మార్చి 26, 1977 - జులై 13, 1977 జనతా పార్టీ జనతా పార్టీ+
8 కె. యస్. హెగ్డె జులై 21, 1977 - జనవరి 21, 1980 జనతా పార్టీ జనతా పార్టీ+
9 బలరామ్ జాఖడ్ జనవరి 22, 1980 - డిసెంబర్ 18, 1989 భారత జాతీయ కాంగ్రేసు భారత జాతీయ కాంగ్రేసు+
10 రాబి రే డిసెంబర్ 19, 1989 - జులై 9, 1991 జనతా దల్ నేషనల్ ఫ్రంట్
11 శివరాజ్ పాటిల్ జులై 10, 1991 - మే 22, 1996 భారత జాతీయ కాంగ్రేసు భారత జాతీయ కాంగ్రేసు+
12 పి. ఏ. సంగ్మా మే 25, 1996 - మార్చి 23, 1998 భారత జాతీయ కాంగ్రేసు యునైటెడ్ ఫ్రంట్
13 గంటి మోహనచంద్ర బాలయోగి మార్చి 24, 1998 - మార్చి 3, 2002 తెలుగుదేశం పార్టీ నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్
14 మనోహర్ జోషి మే 10, 2002 - జూన్ 2, 2004 శివ సేన నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్
15 సోమనాథ్ ఛటర్జీ జూన్ 4, 2004 - మే 30, 2009 కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్
16 మీరా కుమార్ మే 30, 2009 - ప్రస్తుతం భారత జాతీయ కాంగ్రేసు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్

12, ఆగస్టు 2010, గురువారం

లోక్‌సభ


భారత పార్లమెంటు (సన్‌సద్) లో దిగువ సభను లోక్‌సభ (Loksabha) అంటారు. లోక్‌సభ సభ్యులను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ప్రజల ప్రత్యక్ష ప్రాతినిధ్యం ఉండే సభ కనుక ఇది ప్రజల సభ (House of the People) అయింది. రాజ్యాంగం ప్రకారం లోక్‌సభలో గరిష్ఠంగా 552 మంది సభ్యులు ఉండవచ్చు. అందులో 530 మంది రాష్ట్రాల నుండి, 20 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నికైన సభ్యులు కాగా, మిగిలిన ఇద్దరు రాష్ట్రపతి చే నామినేట్ చెయ్యబడ్డ ఆంగ్లో ఇండియన్ సభ్యులు.


లోక్‌సభ సభ్యులను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలు (General Elections) అంటారు. వోటర్ల సంఖ్య రీత్యా, ఎన్నికల పరిమాణం రీత్యా భారత సార్వత్రిక ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత భారీ ఎన్నికలు.


కాల పరిమితి:--



లోక్‌సభ కాలపరిమితి ఐదేళ్ళు. ఎన్నికలు జరిగిన వెంటనే జరిగే మొదటి సమావేశం తేదీ నుండి 5 సంవత్సరాలకు ఆ లోక్‌సభ గడువు తీరిపోతుంది. అయితే ఆత్యయిక పరిస్థితి విధించిన సమయంలో ఈ పరిమితిని ఒక్కో సంవత్సరం చొప్పున పొడిగించుకుంటూ పోవచ్చు. అయితే, ఆత్యయిక పరిస్థితిని ఎత్తివేసిన తరువాత 6 నెలలకు మించి పొడిగించేందుకు వీలులేదు. అయితే, సభను ఐదేళ్ళ కంటే ముందే రద్దు చేయ్యవచ్చు.




జీతభత్యాలు:--



చరణ్‌దాస్‌ మహంత్‌ నేతృత్వంలోని ఎంపీల వేతనాలు, భత్యాల పార్లమెంటరీ సంయుక్త కమిటీ చేసిన సిఫార్సులు:

ఎంపీల వేతనాన్ని నెలకు రూ.16 వేల నుంచి రూ.80,001కి పెంచాలి.
పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యే ఎంపీకి ఒక రోజుకి ప్రస్తుతం ఇస్తున్న భత్యం రూ.వెయ్యిని రూ.2 వేలకు పెంచాలి.
ఎంపీలు తమ నియోజకవర్గాలకు వెళ్లేందుకు 34 ఉచిత విమాన ప్రయాణాలకు అనుమతించాలి.



అధికారాలు:---



పార్లమెంటులో ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే ప్రజలసభయైన లోక్‌సభకు విశేష అధికారాలున్నాయి. ఆర్థికాధికారాల్లో, మంత్రిమండలిని తొలగించే విషయంలో లోక్‌సభకు ప్రత్యేక అధికారాలున్నాయి. ఇంకా శాసన నిర్మాణాధికారాలు, ఆర్థిక, న్యాయ సంబంధ, రాజ్యాంగ సవరణ, ఎన్నిక పరమైన, కార్యనిర్వాహక శాఖపై నియంత్రనాధికారాలు లోక్ సభకు ఉంటాయి.



శాసన నిర్మాణాధికారాలు:--



ఆర్థిక బిల్లులతోబాటు సాధారణ బిల్లులను కూడా లోక్‌సభలో ప్రవేశపెట్టవచ్చు.సాధారణ బిల్లులు కేంద్ర ప్రభుత్వ ఆర్థికేతర, పాలనా పరమైన వ్యవహారాలకు సంబంధించినవి. ఆర్థిక బిల్లులు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల నిర్వహణకు సంబంధించినవి. సాధారణ బిల్లులను ఏ సభలోనైనా మొదట ప్రవేశపెట్టవచ్చును.

రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ లో పేర్కొన్న అధికారాల జాబితాలో కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశిష్ట అధికారాలపై లోక్‌సభ శాసనాలు చేస్తుంది. రాష్ట్ర జాబితాపై కూడా ఇది శాసనాలు చేస్తుంది.



ఆర్థికాధికారాలు:--



ఆర్థికాధికారాల విషయంలో రాజ్యసభ అధికారాలు నామమాత్రం. లోక్‌సభకు ఆర్థిక విషయాల్లో ఎక్కువ అధికారాలున్నాయి. ఉదాహణకు

వార్షికాదాయ, వ్యయ పట్టిక (బడ్జెట్) ను లోక్‌సభలో ప్రవేశపెట్టడం
పన్నుల విధింపు, తొలగింపు, తగ్గింపు
ప్రభుత్వం చేసే ఋణాలకు పరిమితి విధించడం
ఒక బిల్లు సాధారణ బిల్లు అవుతుందా, ఆర్థిక బిల్లు అవుతుందా అనే విషయాన్ని లోక్‌సభ స్పీకర్ నిర్ణయిస్తాడు. లోక్‌సభ స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయడానికి లేదు.స్పీకర్ ఒక బిల్లును ఆర్థిక బిల్లు అని ధృవీకరించిన తర్వాత రాష్ట్రపతి అనుమతితోనే మొదట దాన్ని లోక్‌సభలో ప్రవేశపెడతారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత దాన్ని రాజ్యసభకు పంపుతారు. రాజ్యసభ దాన్ని 14 రోజుల్లోగా అనుమతించి తిరిగి లోక్‌సభకు పంపాలి. ఏ కారణంతోనైనా రాజ్యసభ ఆర్థిక బిల్లును ఆమోదించక చేర్పులు, మార్పులను సూచించి పంపితే, లోక్‌సభ ఆ ప్రతిపాదనలను ఆమోదించవచ్చు.



న్యాయ సంబంధమైన అధికారాలు:--




రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్, యు.పి.ఎస్.సి చైర్మన్ మొదలైనవారి తొలగింపు విషయంలో లోక్‌సభకు అధికారం ఉంటుంది. రాష్ట్రపతిని తొలగించేందుకు ఏ సభలోనైనా మొదట మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. ఉపరాష్ట్రపతిని తొలగించాలంటే మొదట రాజ్యసభలోనే అభియోగ తీర్మానం ప్రవేశపెట్టాలి.



రాజ్యాంగ సవరణ అధికారం:--



368 నిబంధన ప్రకారం రాజ్యాంగ సవరణను ప్రతిపాదించే అధికారం లోక్‌సభకు ఉంది. రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లును కూడా ఉభయ సభలు ఆరు నెలల్లోగా ఆమోదించాలి. ఒకవేళ అలా ఆమోదించకపోతే ఆ బిల్లు వీగిపోతుంది. రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసే అవకాశం లేదు.



ఎన్నిక పరమైన అధికారాలు:--



రాష్ట్రపతి ఎన్నిక నిమిత్తం నియోజక గణంలో లోక్‌సభ భాగంగా ఉంటుంది. అదే విధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా భాగంగా ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులు పాల్గొనే అవకాశం లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులు పాల్గొంటారు. లోక్‌సభ స్పీకర్ ను, ఉప స్పీకర్ ను లోక్‌సభ సభ్యులే ఎన్నుకుంటారు. రాజ్యసభ చైర్మన్ ను మాత్రం రాజ్యసభ సభ్యులు ఎన్నుకోరు. ఉపరాష్ట్రపతే రాజ్యసభకు చైర్మన్ గా వ్యవహరిస్తాడు. రాజ్యసభ సభ్యులు డిప్యూటీ చైర్మన్ ని ఎన్నుకుంటారు. లోక్ సభ వివిధ పార్లమెంటరీ కమిటీలకు సభ్యులను ఎన్నుకుంటుంది. పార్లమెంటు చేపట్టాల్సిన విధులు, బాద్యతలు పెరగడం, పార్లమెంటు సమావేశాల కాలవ్యవధి తక్కువగా ఉండటం వలన పార్లమెంటు తన విధులు, భాద్యతలు నెరవేర్చేందుకు పార్లమెంటరీ కమిటీలు సహాయం చేస్తాయి. ఉదాహరణకు అంచనాల సంఘం, ప్రణాళికా సంఘం మొదలైనవి.


నియంత్రణాధికారం:--


లోక్‌సభ అధికారాల్లో కార్యనిర్వాహక వర్గం కూడా ఒకటి. అంటే మంత్రిమండలిని నియంత్రించడం. భారత పార్లమెంటరీ వ్యవస్థలో మంత్రిమండలి లోక్‌సభకు భాద్యత వహిస్తుంది. మంత్రిమండలి లో ఎక్కువ లోక్‌సభ సభ్యులే కావడంతో లోక్‌సభకు బాధ్యత వహిస్తారు. లోక్‌సభ విశ్వాసం పొందినంత కాలం మాత్రమే మంత్రిమండలి అధికారంలో ఉండి, విశ్వాసం కోల్పోయిన తర్వాత వైదొలగాల్సి ఉంటుంది. కార్యనిర్వాహక వర్గంపై నియంత్రణను లోక్ సభ రెండు రకాలుగా చేపడుతుంది.

1.ప్రభుత్వ వ్యవహారాల గురించి సమాచారాన్ని తెలుసుకోవడం
2.ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం లేదా విమర్శించడం
వీటికోసం వివిధ పార్లమెంటరీ ప్రక్రియలను అనుసరిస్తుంది. ఈ ప్రక్రియల్లో ప్రశ్నోత్తరాలు, తీర్మానాలు ఉంటాయి.


అర్హతలు:--


భారతీయ పౌరులై ఉండాలి
25 ఏళ్ళ వయసు నిండి ఉండాలి.
పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి
నామినేషన్ తో పాటు రూ.10000/- చెల్లించాలి.


అనర్హతలు:--


ఒక వ్యక్తి ఏక కాలంలో ఉభయ సభల్లో సభ్యుడిగా కొనసాగలేడు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆదాయం పొందే పదవిలో ఉండటం
మతిస్థిమితం లేనివాడని న్యాయస్థానం ధృవీకరించడం
ఒక వ్యక్తి లోక్‌సభ సభ్యుడిగా కొనసాగడానికి అర్హత కోల్పోయాడా లేదా అనేది రాష్ట్రపతి నిర్ణయించడం జరుగుతుంది. దీనికోసం మొదట ఎన్నికల సంఘం అభిప్రాయం తీసుకుంటారు.

చరిత్ర:--

1950 జనవరి 26 న రాజ్యాంగం అమలు లోకి వచ్చిన తరువాత, మొదటి సార్వత్రిక ఎన్నికలు 1951-52 లో జరిగాయి. మొదటి ఎన్నికైన లోక్‌సభ ఏప్రిల్, 1952 న అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి వివిధ లోక్‌సభల వివరాలు ఇలా ఉన్నాయి:

లోక్‌సభ ఏర్పాటు స్పీకరు
మొదటి లోక్‌సభ ఏప్రిల్ 1952 జి.వి.మావలాంకర్, మాడభూషి అనంతశయనం అయ్యంగారు
రెండవ లోక్‌సభ ఏప్రిల్ 1957 మాడభూషి అనంతశయనం అయ్యంగారు
మూడవ లోక్‌సభ ఏప్రిల్ 1962 సర్దార్ హుకం సింగ్
నాలుగవ లోక్‌సభ మార్చి 1967 నీలం సంజీవరెడ్డి, జి.ఎస్.ధిల్లాన్
ఐదవ లోక్‌సభ మార్చి 1971 జి.ఎస్.ధిల్లాన్, బలిరాం భగత్
ఆరవ లోక్‌సభ మార్చి 1977 కె.ఎస్.హెగ్డే
ఏడవ లోక్‌సభ జనవరి 1980 బలరాం జాఖర్
ఎనిమిదవ లోక్‌సభ డిసెంబర్ 1984 బలరాం జాఖర్
తొమ్మిదవ లోక్‌సభ డిసెంబర్ 1989 రబీ రే
పదవ లోక్‌సభ జూన్ 1991 శివరాజ్ పాటిల్
పదకొండవ లోక్‌సభ మే 1996 పి.ఎ.సంగ్మా
పన్నెండవ లోక్‌సభ మార్చి 1998 గంటి మోహనచంద్ర బాలయోగి
పదమూడవ లోక్‌సభ అక్టోబర్ 1999 గంటి మోహనచంద్ర బాలయోగి, మనోహర్ జోషి
పదునాల్గవ లోక్‌సభ మే 2004 సోమనాథ్ చటర్జీ
పదహేనో లోక్‌సభ మే 2009 మీరా కుమార్

ఐదవ లోక్‌సభ సమయంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఆత్యయిక పరిస్థితి విధించి, సభ కాలపరిమితిని పొడిగించింది. లోక్‌సభ చరిత్రలో కాలపరిమితి పొడిగించబడిన సభ ఇదే.



సభా నిర్వహణ:--


లోక్‌సభా నిర్వహణ బాధ్యత ను స్పీకర్ నిర్వహిస్తారు. సభ్యులు తమలో ఒకరిని స్పీకర్‌గా ఎన్నుకుంటారు. స్పీకర్‌కు సహాయంగా ఒక డిప్యూటీ స్పీకర్‌ను కూడా ఎనుకుంటారు. సార్వత్రిక ఎన్నికల తరువాత సభ్యుల ప్రమాణ స్వీకారంతో లోక్‌సభ ఏర్పాటు అవుతుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమ నిర్వహణకు ఒక తాత్కాలిక స్పీకరును సభులలో ఒకరిని ఎంచుకుంటారు. సాధారణంగా అనుభవజ్ఞుడైన సభ్యుని ఎంచుకోవడం రివాజు. తరువాత స్పీకరు ఎన్నిక జరుగుతుంది. ఆపై, సభా నిర్వహణ బాధ్యత పూర్తిగా స్పీకరుదే. సభానిర్వహణ కొరకు వివిధ నిబంధనలు ఏర్పాటయ్యాయి. సభ్యుల ప్రవర్తనను నిర్దేశిస్తూ ప్రవర్తనా నియమావళి ఉంది. వివిధ అంశాలకు సమయం కేటాయింపు కొరకు బిజినెస్ ఎడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది.


శూన్య సమయం (జీరో అవర్):--


జీరో అవర్ అనేది భారత పార్లమెంటు సొంతంగా రూపొందించుకున్న పద్దతి. 1962లో పార్లమెంటులో ఈ పద్దతిని ప్రవేశపెట్టారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత జీరో అవర్ ఉంటుంది. ప్రశ్నోత్తరాల కార్యక్రమం 11 గంటలకు, జీరో అవర్ 12గంటలకు ప్రారంభమౌతాయి. ఇందులో ఎలాంటి నోటీసు లేకుండా ప్రశ్నలడగవచ్చు.



సమావేశాలు:--


లోక్‌సభ సమావేశాలు సాధారణంగా ఉ.11 గంటల నుండి మ.1 వరకు, మళ్ళీ మ.2 నుండి 6 వరకు జరుగుతాయి. విషయ ప్రాముఖ్యతను బట్టి ఈ సమయాలు పొడిగించబడటం జరుగుతూ ఉంటుంది. కనీస సంఖ్యలో సభ్యులు ఉంటేనే సమావేశం మొదలవుతుంది. ఈ సంఖ్యను కోరం అంటారు. లోక్‌సభకు కోరం - స్పీకరుతో కలిపి 55. కొత్తగా ఎన్నికై, ఇంకా ప్రమాణస్వీకారం చెయ్యని సభ్యులు ఉంటే, వారి చేత ముందు ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఇటీవలి కాలంలో గతించిన ప్రస్తుత లేదా పూర్వపు సభ్యుల పట్ల సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు.



లోక్‌సభలో కింది ముఖ్యమైన వ్యాపకాలు చేపడతారు.



ప్రశ్నోత్తరాలు: సభ్యుల ప్రశ్నలకు సంబంధిత మంత్రుల సమాధానాలు ఇస్తారు. ప్రశ్నల్లో మూడు రకాలు ఉంటాయి. అవి:
నక్షత్ర గుర్తు గల ప్రశ్నలు. వీటికి మంత్రులు సభలో జవాబిస్తారు. వీటికి అనుబంధ ప్రశ్నలు కూడా అడగవచ్చు
నక్షత్ర గుర్తు లేనీ ప్రశ్నలు: వీటికి రాతపూర్వక సమాధానాలు ఇస్తారు. వీటికి అనుబంధ ప్రశ్నలు ఉండవు.
స్వల్ప అవధి ప్రశ్నలు: పై రెండు రకాల ప్రశ్నలకు జవాబిచ్చేందుకు కనీసం 10 రోజుల వ్యవధి ఉంటుంది. విషయ ప్రాముఖ్యతను బట్టి కొన్ని ప్రశ్నలకు మరింత త్వరగా సమాధాన్ని సభ్యులు ఆశించవచ్చు. వీటిని స్వల్ప అవధి ప్రశ్నలు అంటారు. స్పీకరు అనుమతితో ఇటువంటి ప్రశ్నలు అడగవచ్చు.
ఇతరత్రా వ్యాపకాలు: ప్రశ్నోత్తరాల సమయం ముగిసాక, ఈ కార్యక్రమం చేపడతారు. వాయిదా తీర్మానాలు, హక్కుల తీర్మానాలు, అధికార పత్రాల సమర్పణ, రాజ్యసభ సందేశాలు, సభాసంఘాల నియామకాలు, నివేదికలు, రాష్ట్రపతి ఆమోదముద్ర పొందిన బిల్లుల వివరాలు మొదలైనవి ఇందులో ఉంటాయి.
ప్రధాన వ్యాపకం: వివిధ రకాలైన బిల్లులు, సాధారణ బడ్జట్, రైల్వే బడ్జట్ వంటి ఆర్ధిక అంశాలు, ప్రభుత్వం గానీ, లేదా ప్రైవేటు సభ్యుడు గానీ ప్రవేశపెట్టే తీర్మానాలు ఈ సమయంలో చేపడతారు.
పై వ్యాపకాలు కాక, అరగంట చర్చలు, అత్యవసర ప్రజా ప్రాముఖ్య విషయాలు కూడా సభాకార్యక్రమాల్లో భాగం.


తీర్మానాలు:--


తీర్మానాల్లో అవిశ్వాస తీర్మానం, విశ్వాస తీర్మానం, వాయిదా తీర్మానం మొదలైనవి ఉన్నాయి


అవిశ్వాస తీర్మానం:-0-

ప్రభుత్వాన్ని నియంత్రించే శక్తివంతమైన రాజ్యాంగ పద్ధతుల్లో అవిశ్వాస తీర్మానం ఒకటి. దీన్ని లోక్‌సభలో మాత్రమే ప్రవేశ పెట్టాలి. అవిశ్వాస తీర్మానం ఫలానా అంశంపై అని చెప్పనవసరం లేదు. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతాయి. ఈ తీర్మానాన్ని మొత్తం మంత్రిమండలిపై ప్రవేశపెట్టాలి. అవిశ్వాస తీర్మానాన్ని సభ స్వీకరించడానికి కనీసం 50 మంది సభ్యుల మద్ధతు అవసరం. అవిశ్వాస తీర్మానానికి మద్ధతు ఇవ్వాలా? వద్దా? అనే నిర్ణయాధికారం స్పీకర్ కు ఉంటుంది.



విశ్వాస తీర్మానం:--


దీన్ని కూడా లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి. అధికార పక్షం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది. విశ్వాస తీర్మానంపై చర్చ, ఆ తరువాత ఓటింగ్ జరుగుతాయి. ఓటింగ్ లో ప్రభుత్వం ఓడిపోతే వెంటనే రాజీనామా చేయాలి. భారతదేశం పార్లమెంటు చరిత్రలో మొదటిసారిగా విశ్వాస తీర్మానాన్ని 1979, ఫిబ్రవరిలో ప్రవేశపెట్టారు. అప్పటి చరణ్‌సింగ్ ప్రభుత్వాన్ని సభావిశ్వాసాన్ని పొందవలసిందిగా అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఆదేశించాడు. దాంతో భారతదేశ పార్లమెంటరీ సంప్రదాయాల్లో విశ్వాస తీర్మానం ఆచరణలోకి వచ్చింది.


వాయిదా తీర్మానం:--


ప్రజాప్రాముఖ్యం ఉన్న ఆకస్మిక లేదా హఠాత్ సంఘటనలను చర్చించడానికి స్పీకర్ అనుమతితో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడతారు. దీన్ని ప్రవేశపెట్టేందుకు 50 మంది సభ్యుల మద్ధతు అవసరం. వాయిదా తీర్మానం అనుమతి పొందితే సభలో మిగిలిన వ్యవహారాలన్నీ వాయిదా వేస్తారు. ఈ తీర్మానం యొక్క ముఖ్యోద్దేశం ముఖ్యమైన విషయం మీదకు సభ దృష్టిని మళ్ళించడం. ఈ తీర్మానంపై ఓటింగ్ జరగదు.



సావధాన తీర్మానం:--


ప్రజాప్రాముఖ్యం ఉన్న సమస్యను అత్యవసరంగా చర్చించేందుకు, ఆ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళేందుకు ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఈ తీర్మానం ముఖ్యోద్దేశం సమస్యపై సంబంధిత మంత్రి నుంచి అధికారిక వ్యాఖ్య ను కోరడం. సభ నియమాల ప్రకారం కనీసం ఇద్దరు సభ్యులు స్పీకర్ కు ఒక గంట ముందు నోటీసు ఇవ్వాలి.స్పీకర్ అనుమతి లభిస్తే 2.30 గంటలపాటు చర్చ జరుగుతుంది. ఒక విధంగా ఇది ప్రభుత్వ మందకొడితనానికి చికిత్స లాంటిది.