12, ఆగస్టు 2010, గురువారం

ప్రతిభా పాటిల్


ప్రతిభా పాటిల్ (మరాఠీ: प्रतिभा पाटील) భారతదేశ 12వ మరియు ప్రస్తుత రాష్ట్రపతి. భారత దేశపు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి మరియు మహారాష్ట్ర నుండి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి. ఈమె 1934 సంవత్సరము డిసెంబర్ 19వ తేదీన మహారాష్ట్ర రాష్ట్రములోని నందగావ్‌లో జన్మించింది. ఈమె అబ్దుల్ కలామ్ నుండి రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు 2007, జూలై 25 తేదిన స్వీకరించింది. ఈమెను భారత దేశ ఛీఫ్ జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ ప్రమాణస్వీకారము చేయించాడు.

భారత జాతీయ కాంగ్రేసు సభ్యురాలైన పాటిల్ ను అధికార పక్షమైన జాతీయ ప్రజాతంత్ర కూటమి మరియు వామపక్షాలు అధ్యక్ష పదవికి తమ అభ్యర్ధిగా నిలబెట్టాయి. జూలై 19,2007న జరిగిన అధ్యక్ష ఎన్నికలలో పాటిల్ తన సమీప ప్రత్యర్ధి అయిన భైరాం సింగ్ షెకావత్ పై 3,00,000 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందింది.[1][2][3]

వృత్తిరీత్యా న్యాయవాది అయిన పాటిల్, 1962 నుండి 1985 వరకు జల్‌గావ్ జిల్లాలోని ఏద్లాబాద్ నియోజకవర్గము నుండి మహారాష్ట్ర శాసనసభ సభ్యురాలిగా పనిచేసినది. ఆ తరువాత 1986 నుండి 1988 వరకు రాజ్యసభ డిప్యుటీ ఛైర్మెన్‌గా, 1991 నుండి 1996 వరకు అమ్రావతి పార్లమెంటు నియోజకవర్గమునుండి లోక్‌సభకు ఎన్నికై పార్లమెంటు సభ్యురాలిగా పనిచేసినది. 2004 నుండి 2007లో రాష్ట్రపతిగా ఎన్నికయ్యేవరకు రాజస్థాన్ రాష్ట్రానికి 24వ మరియు తొలి మహిళా గవర్నరుగా పనిచేసినది.


ఆరంభ జీవితం:--

ప్రతిభా పాటిల్ మహారాష్ట్రలోని నద్‌గావ్లో నారాయణ్ పగ్లూ రావుకు జన్మించింది. ఈమె పాఠశాల చదువు జల్‌గావ్లోని ఆర్.ఆర్.పాఠశాలలో సాగింది. ఈమె ఉత్తర మహారాష్ట్ర విశ్వవిద్యాలయానికి అనుబంధముగా ఉన్న జల్‌గావ్‌లోని మూల్జీ జైతా (ఎం.జె) కళాశాల నుండి ఎం.ఏ పట్టాను, ముంబాయి ప్రభుత్వ న్యాయ కళాశాలనుండి లా డిగ్రీని పొందినది. కళాశాల రోజుల్లో టేబుల్ టెన్నిస్ క్రీడలో బాగా రాణించిన పాటిల్, అనేక అంతర్-కళాశాల పోటీలలో గెలుపొందింది.[4] 1962లో, ప్రతిభా పాటిల్ ఎం.జె.కళాశాల యొక్క "కాలేజ్ క్వీన్" గా ఎన్నికైంది.[5] అదే సంవత్సరము, కాంగ్రేసు పార్టీ అభ్యర్ధిగా ఏద్లాబాద్ నియోజకవర్గము నుండి మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికైనది.

ఈమె 1965, జూలై 7న విద్యావేత్త దేవీసింగ్ రణ్‌సింగ్ షెకావత్ను వివాహమాడినది.[6] ఈ దంపతులకు ఒక కొడుకు మరియు ఒక కూతురు ఉన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి