11, ఆగస్టు 2010, బుధవారం

భారత ప్రభుత్వము

భారత ప్రభుత్వము (హిందీ: भारत सरकार) సాధారణంగా కేంద్ర ప్రభుత్వము అని వ్యవహరింపబడుతుంది. భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయబడింది. దేశంలో గల 28 రాష్ట్రాలు, మరియు ఏడు కేంద్రపాలిత ప్రాంతాల మీద అధికారాన్ని కలిగి ఉంటుంది. ఇది భారత రాజధానియైన ఢిల్లీ లో కేంద్రీకృతమై ఉంటుంది.

భారత ప్రభుత్వ యంత్రాంగం మూడు స్వతంత్ర విభాగాలుగా ఏర్పడి ఉన్నది. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. కార్యనిర్వాహక వ్యవస్థ రాష్ట్రపతి ఆద్వర్యంలో నడుస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి